Thursday, September 25, 2014

ఐఫోన్ 6లో ఏమున్నాయి?

చుక్కల్లో చంద్రుడు ఎలాగో స్మార్ట్‌ఫోన్లలో ఐఫోన్ అలా అనడం అతిశయోక్తి కాదేమో. అందుకే కొత్త మోడల్ ఐఫోన్ విడుదలైన ప్రతిసారి సందడి సందడిగా ఉంటుంది. కొత్త కొత్త రికార్డులు పుట్టుకొస్తూంటాయి. తాజాగా ఐఫోన్ 6, 6 ప్లస్, ఐఓఎస్ 8లు కూడా దీనికి భిన్నమేమీ కాదు. విడుదలైన తరువాత తొలి వారాంతంలో ఏకంగా కోటి ఐఫోన్లను విక్రయించి ఆపిల్ మరో రికార్డు సృష్టించింది. ఇంతకీ ఈ తాజా ఐఫోన్లలో ఉన్న విశేషాలేమిటి? అర లక్ష పోసి కొంటే వచ్చే ప్రయోజనాలేమిటి?

ముందుగా ఆపిల్ తాజా ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 8 గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఆపిల్ అభిమానులు ఈ కొత్త ఓఎస్‌ను చూసి పెదవి విరిచేశారు. అయితే కొంచెం తరచి చూస్తేగానీ దీంట్లోని కొత్త ఫీచర్లేమిటన్నది స్పష్టం కాదు. ఉదాహరణకు... పాతతరం ఐఫోన్లలో ఈమెయిల్ మల్టీటాస్కింగ్ సౌకర్యం అస్సలు లేదు. స్క్రీన్‌పై ఉన్న మెయిల్‌ను క్లోజ్ చేస్తేగానీ రెండోదాన్ని ఓపెన్ చేయడం సాధ్యమయ్యేది కాదు. ఐఫోన్ 6లో ఈ ఇబ్బంది లేదు. మెయిల్‌ను ఒకసారి కిందివైపు స్వైప్ చేస్తే చాలు... నేరుగా ఇన్‌బాక్స్‌లోకి వెళ్లవచ్చు. దీంతోపాటు మెయిళ్లను ట్యాబ్‌ల మాదిరిగా ఓపెన్ చేసి బ్రౌజ్ చేయవచ్చు కూడా.

థర్డ్ పార్టీ కీబోర్డు

ఆపిల్ ఉత్పత్తులు అన్నింటిలో ప్రొప్రయిటరీ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లనే వాడుతూంటారు. ఇతర కంపెనీల ఉత్పత్తులను వాడుకునే అవకాశం దాదాపుగా ఉండదు. తాజ ఐఫోన్ దీనికి మినహాయింపు. ప్రత్యేకంగా రూపొందించిన ఐఫోన్ కీబోర్డు స్థానంలో ఇతర కంపెనీల కీబోర్డులు కూడా వాడుకునేందుకు దీంట్లో అవకాశం కల్పించారు.సెట్టింగ్స్‌లోని జనరల్ ట్యాబ్‌లో ఉండే కీబోర్డు ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుని మీకు నచ్చిన కీబోర్డును ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అయితే కొత్త కీబోర్డుతో వాయిస్ టు టెక్స్ట్ ఫీచర్ పనిచేయదు. టచ్ ఐడీ ఫీచర్‌లోనూ ఇతర కంపెనీల ఉత్పత్తులను వాడుకునేందుకు అవకాశం కల్పించడం మరో విశేషం.

నోటిఫికేషన్లతో గమ్మత్తులు..

కొత్త మెసేజీలు, అలర్ట్‌ల వివరాలు తెలుసుకునేందకు పనికొచ్చే నోటిఫికేషన్ ఏరియా ఇప్పుడు గమ్మత్తులకు కేంద్రమైంది. ఆయా నోటిఫికేషన్లు ఎక్కడి నుంచి (మెసేజ్, వాట్స్ యాప్, మెయిల్ వంటివి) వచ్చినప్పటికీ ఆయా అప్లికేషన్లలోకి వెళ్లే అవసరం లేకుండా నేరుగా వాటికి సమాధానమివ్వడం, డిలీట్ చేయడం, అలారం వంటి వాటిని ఆఫ్ చేయడం చేసేయవచ్చు. వీటితోపాటు వాయిస్ అసిస్టెంట్ సిరిలోనూ కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి.

ఐఫోన్ బ్యాటరీ వినియోగంపై ఒక కన్నేసి ఉంచేందుకు ఏర్పాట్లు ఉండటం ఐఫోన్ 6లో కనిపించే ప్రత్యేకమైన ఫీచర్. దీన్ని ఉపయోగించుకునేందుకు సెట్టింగ్స్‌లోని జనరల్ ఆప్షన్‌లోకి వెళ్లండి. యూసేజ్, బ్యాటరీ అని ఉన్న చోట ట్యాప్‌చేస్తే ఏఏ అప్లికేషన్లు ఎంత మేరకు బ్యాటరీని వాడుతున్నాయో తెలుస్తుంది. అంతేకాదు... ఆయా అప్లికేషన్లు ఎందుకు అంత మేరకు బ్యాటరీని ఉపయోగించాయో కూడా వివరించడం (సిగ్నల్ సామర్థ్యం తక్కువగా ఉందని... చాలాసమయం పాటు ఆన్‌లో ఉన్నట్లు... ) విశేషం.

Friday, September 12, 2014

యాపిల్ వాచ్ వచ్చేసింది...

యాపిల్ కొత్త ఉత్పత్తుల రాక కోసం యావత్ టెక్నాలజీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన క్షణాలు రానేవచ్చాయి. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్థరాత్రి టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్‌తో పాటు తమ మొట్ట మొదటి స్మార్ట్‌వాచ్ యాపిల్ వాచ్‌ను ప్రపంచనాకి పరిచయం చేసింది.
 
యాపిల్ వాచ్ ఐఓఎస్ 8 ప్లాట్‌ఫామ్ పై స్పందిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఇటీవల విడదలైన మోటరోలా మోటో 360, సామ్‌సంగ్ గెలాక్సీ గేర్ ఎస్ స్మార్ట్‌వాచ్‌లకు ఈ యాపిల్ డివైజ్ పోటీగా నిలవనుంది. యాపిల్ ఈ విప్లవాత్మక స్మార్ట్‌వాచ్‌ను 2015లో అన్ని ప్రముఖ మార్కెట్లలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. యాపిల్ వాచ్ ధర 349 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.20,940) ఉండొచ్చని ఓ అంచనా. యాపిల్ వాచ్, తాజాగా విడుదలైన ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లతో పాటు ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 5సీ, ఐఫోన్ 5 స్మార్ట్‌పోన్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ వాచ్ మొత్తం మూడు వేరియంట్‌లలో అందుబాటులోకి రానుంది. 
 
వాటి వివరాలు.. 
యాపిల్ వాచ్, యాపిల్ వాచ్ స్పోర్ట్స్, యాపిల్ వాచ్ ఎడిషన్. యాపిల్ వాచ్ ఎడిషన్ వేరియంట్‌ను 18 క్యారట్ బంగారంతో డిజైన్ చేసినట్లు కంపెనీ సిఈఓ టిమ్ కుక్ తెలిపారు. మరో వేరియంట్ యాపిల్ వాచ్ వివిధ మోడళ్ల లెదర్, మెటల్ ఇంకా స్పోర్ట్ బ్యాండ్ ఆప్షన్‌లతో కలుపుకుని మొత్తం 18 మోడళ్లలో అందుబాటులోకి రానుంది. యాపిల్ వాచ్ స్పోర్ట్స్ వేరియంట్ 10 మోడళ్లలో లభ్యంకానుంది. 
 
యాపిల్ వాచ్‌ను వినియోగదారులు పూర్తిస్థాయి ఆరోగ్య సంబంధిత అలానే వ్యాయమ సంబంధిత ఉపకరణంలా ఉపయోగించుకోవచ్చని ఆవిష్కరణ సందర్భంగా కంపెనీ సీఈఓ టిమ్ కుక్ స్పష్టం చేసారు. ప్రత్యేకమైన కస్టమ్ యూజర్ ఇంటర్ ఫేస్‌తో రూపకల్పన కాబడిన ఈ స్మార్ట్‌వాచ్‌కు ‘డిజిటల్ క్రౌన్' ప్రధాన ఆకర్షణ కానుంది. వాచ్ కుడివైపు భాగంలో ఏర్పాటు చేసిన ఈ డిజిటల్ క్రౌన్ బటన్‌ను ప్రెస్ చేయటం ద్వారా వాచ్ డిస్‌ప్లేను తాకకుండానే ఆన్ - స్ర్కీన్ యాక్షన్‌లను నిర్విహించుకోవచ్చు. డిజిటల్ క్రౌన్ బటన్ యాపిల్ వాచ్‌కు హోమ్ బటన్ గాను ఉపయోగపడుతుంది. ఈ బటన్ ద్వారానే యాపిల్ వాయిస్ సెర్చ్ ఫీచర్ ‘సిరీ'ని యాక్సెస్ చేసుకోవచ్చు. యాపిల్ వాచ్ డిస్‌ప్లే పటిష్టమైన ఫ్లెక్సిబుల్ రెటీనా ప్యానల్‌ను కలిగి ఉంటుంది. పటిష్టమైన సఫైర్ గ్లాస్‌ను వాచ్ డిస్‌ప్లే పై అమర్చారు. వినియోగదారుడి ఫిట్నెస్ తో పాటు ఆరోగ్యాన్ని పర్యవేక్షించే ప్రత్యేక సెన్సార్ వ్యవస్థను యాపిల్ ఈ స్మార్ట్‌వాచ్‌లో నిక్షిప్తం చేసింది. మీ ఐఫోన్ కు సంబంధించిన కార్యకలాపాలను నేరుగా ఈ స్మార్ట్ వాచ్ ద్వారానే నిర్వహించుకోవచ్చు. వాచ్‌ను స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించిన అనంతరం నేరుగా వాచ్ ద్వారానే కాల్స్ చేయవచ్చు, కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు, మెసేజ్‌లను చెక్ చూసుకోవచ్చు.

Wednesday, September 10, 2014

ఐఫోన్ 6 వచ్చేసింది...

ఐఫోన్ 6 వచ్చేసింది...


 యాపిల్ కంపెనీ ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లను మంగళవారం అర్ధరాత్రి(భారత కాల మానం ప్రకారం)ఆవిష్కరించింది. వీటితో పాటు ఐవాచ్‌ను కూడా కంపెనీ సీఈవో టిమ్ కుక్ ఆవిష్కరించారు. ఈ నెల 12 నుంచి బుకింగ్‌లు ప్రారంభమవుతాయని, ఈ నెల 19 నుంచి డెలివరీలు ప్రా రంభిస్తామని కంపెనీ పేర్కొంది. ఈ రెండు ఫోన్లను ఏ8 చిప్‌తో యాపిల్ కంపెనీ రూపొందించింది.

ఇంతకు ముందటి ఐఫోన్‌లలోని చిప్‌లతో పోల్చితే ఇది 25% అధిక వేగంగానూ, 50 శాతం మెరుగ్గానూ పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. ఐఫోన్ 6లో 4.7 అంగుళాల డిస్‌ప్లే, 6.9 ఎంఎం మందం,    8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. 14 గంటల టాక్‌టైమ్, 11 గంటల వీడియో, 10 రోజుల స్టాండ్‌బై, 4జీని సపోర్ట్ చేస్తుంది. ధరలు 16 జీబీ మోడల్ 199 డాలర్లు, 299 డాలర్లు(64 జీబీ), 399 డాలర్లు(128 జీబీ).

అమెరికాలో టెల్కోల కాంట్రాక్టుతో ధరలివి.ఇక ఐఫోన్ 6ప్లస్‌లో 5.5 అంగుళాల స్క్రీన్, 7.1 ఎంఎం మందం, రెటీనా డిస్‌ప్లే హెచ్‌డీ, 16 గంటల స్టాండ్‌బై టైమ్, 14 గంటల వీడియో ప్లేబ్యాక్,  8 మెగాపిక్సెల్ ఐసైట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి.  ధరలు 16 జీబీ మోడల్ 299 డాలర్లు, 399 డాలర్లు(64 జీబీ),499 డాలర్లు(128 జీబీ).

Thursday, September 4, 2014

బ్యాటరీ మన్నికకు కొత్త ఆప్...

బ్యాటరీ మన్నికకు కొత్త ఆప్...

బ్యాటరీ ఛార్జింగ్‌ను ఎక్కువకాలం పనిచేయించేందుకు గూగుల్ ప్లే స్టోర్‌లో బోలెడన్ని అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవేవీ బ్యాటరీ మరింత ఎక్కువ కాలం మన్నేలా చేయలేవు. కానీ పర్డ్యూ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త ఛార్లీ హూ అభివృద్ధి చేసిన ఎస్టార్  అప్లికేషన్ మాత్రం బ్యాటరీ జీవితకాలాన్ని కూడా పెంచుతుంది. మీరు డౌన్‌లోడ్ చేసుకున్న, లేదా చేసుకోబోతున్న అప్లికేషన్లు ఎంత మేరకు విద్యుత్తు ఖర్చు చేస్తాయో ఎప్పటికప్పుడు లెక్కకట్టి మీకు తెలియజేయడం ద్వారా ఇది సాధ్యమవుతుందని అంటున్నారు ఛార్లీ. ఈ సమాచారం ఆధారంగా మీరు ఎక్కువ విద్యుత్తును వాడుకునే అప్లికేషన్లను తొలగించుకోవచ్చు. ఎస్టార్ సూచించే పొదుపైన ఆప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తద్వారా విద్యుత్తును ఆదా చేసి, బ్యాటరీ ఎక్కువ సార్లు రీఛార్జ్ చేయాల్సిన అవసరాన్ని తగ్గించవచ్చునన్నమాట. ఇవన్నీ చేస్తే బ్యాటరీ జీవితకాలం కూడా పెరిగిపోతుందన్నది తెలిసిందే. గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా లభిస్తున్న ఎస్టార్‌లో ఫైవ్‌స్టార్ ఎనర్జీ రేటింగ్‌ను పోలిన కోడింగ్ ఉంటుంది.

 ఆన్‌లైన్ మ్యూజిక్, రేడియో కోసం వింక్స్..

 ప్రముఖ సెల్‌ఫోన్ క్యారియర్ సంస్థ ఎయిర్‌టెల్ మ్యూజిక్ రంగంలోకి అడుగుపెట్టింది. వింక్స్ పేరుతో ఒక అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది. ఆండ్రాయిడ్ లేదా ఆపిల్ ఐఫోన్లలో ఈ అప్ ద్వారా సంగీతాన్ని ఎంచక్కా ఎంజాయ్ చేయవచ్చు. ఎయిర్‌టెల్ కనెక్షన్ లేకున్నా ఉచితంగా పాటలను వినే అవకాశం ఉండటం విశేషం. ఈ సర్వీసులో దాదాపు ఎనిమిది భాషలకు సంబంధించిన 17 లక్షల పాటలు అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది. వినే పాటల్ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునేవారికి ప్రస్తుతం రెండు రకాల సబ్‌స్క్రిప్షన్స్ ఉన్నాయని కంపెనీ తెలిపింది. వింక్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ నెలకు రూ.99 కాగా, వింక్ ఫ్రీడమ్ ఎయిర్‌టెల్ వినియోగదారుల కోసం ఉద్దేశించింది. ఆర్టిస్ట్, మూడ్స్, జెనెర్ విభాగాల్లో లభ్యమయ్యే పాటలను 32, 64, 128 కేబీపీఎస్ నాణ్యత ప్రమాణాల్లో వినే అవకాశం ఉంది.

Thursday, August 28, 2014

భలే ఆప్స్

చేయి తడితే క్లిక్ క్లిక్ క్లిక్!

ఈ రోజుల్లో సెల్ఫీలదే హవా. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే సెల్ఫీలే సెల్ఫీలు. కానీ గ్రూప్ ఫోటో తీసుకోవాలంటే? అందంగా పోజిచ్చిన తరువాత క్లిక్ మనిపించాలంటే? ఇంకొకరి సాయం కావాలా? ఊహూ అవసరం లేదంటోంది స్నాప్ క్లాప్ అప్లికేషన్. ఆండ్రాయిడ్ ప్లేస్టోర్‌లో ఉచితంగా లభించే ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే మీ కెమెరాతో ఎన్నో ట్రిక్కులు చేయవచ్చు. మీరు చేయాల్సిందల్లా గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టడమే. సెల్ఫీల్లా ఫ్రంట్ కెమెరాతో మాత్రమే కాకుండా ఎక్కువ రెజల్యూషన్ ఉండే ప్రధాన కెమెరాతోనూ ఫొటోలు తీసుకోవచ్చు. ఫొటోకు అవసరమైన లైటింగ్ సరిగా లేకపోతే ఈ అప్లికేషన్ వార్నింగ్ కూడా ఇస్తుంది. ఫొటోల ఎడిటింగ్, మిత్రులతో షేరింగ్ వంటివి అదనపు ఫీచర్లు!

ఇన్‌స్టాబ్రిడ్జ్‌తో ఫ్రీ వైఫై


వీధి వెంబడి వెళుతూంటే ‘‘వైఫై నెట్‌వర్క్ అవైలబుల్’ అన్న నోటిఫికేషన్లు తరచూ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతూంటాయి. ఈ నెట్‌వర్క్‌లలో కొన్ని ఉచితంగానూ లభించవచ్చు. కానీ ఆ నెట్‌వర్క్‌లేవో తెలియకపోవడం వల్ల మనం వాటిని ఉపయోగించుకోలేము. ఇన్‌స్టా బ్రిడ్జ్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే ఈ కొరత తీరిపోతుంది. ఉచిత వైఫై హాట్‌స్పాట్‌లను గుర్తించడంతోపాటు ఆయా నెట్‌వర్క్‌ల స్పీడ్‌ను లెక్కకట్టేందుకు, డేటా యూసేజ్‌ను తెలుసుకునేందుకు కూడా ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. అంతే కాకుండా పాస్‌వర్డ్ పంచుకోకుండానే వైఫై నెట్‌వర్క్‌ను ఇతరులతో షేర్ చేసుకునేందుకు దీంట్లో ఏర్పాట్లు ఉన్నాయి. అన్ని కనెక్షన్లకూ క్లౌడ్ బ్యాకప్ ఉండటం మరో విశేషం. ఉచిత వైఫై హాట్‌స్పాట్‌లలో సక్రమంగా పనిచేయని వాటిని గుర్తించి ఎప్పటికప్పుడు వాటిని వదిలించుకోవచ్చు కూడా.

బుడతల ఐడియాలకు రూపమిచ్చే ‘మై ఇండియా’

దేశంలోని అనేక సమస్యలపై పిల్లల్లోనూ అవగాహన పెంపొందించేందుకు, వాటిపై తమతమ ఆలోచనలను ఇతరులతో పంచుకునేందుకు బోధ్‌గురు అనే సంస్థ వినూత్నమైన మొబైల్ అప్లికేషన్లను విడుదల చేసింది. భారత 68వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ అప్లికేషన్లతో చిన్నారులు తమ ఆలోచనలను ఆడియో, వీడియోలతో ఒక పుస్తక రూపంలోకి తీసుకురావచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన మైగవ్ వెబ్‌సైట్ స్ఫూర్తితో తాము ఈ అప్లికేషన్లను అభివృద్ధి చేశామని నాలుగేళ్లు మొదలుకొని 18 ఏళ్ల యువకుల వరకూ ఎవరైనా ఈ అప్లికేషన్‌ను ఉపయోగించవచ్చునని కంపెనీ తెలిపింది. పారిశుద్ధ్యంతోపాటు, పర్యావరణ పరిరక్షణ, డిజిటల్ ఇండియా వంటి అంశాలపై పిల్లలు చిన్న చిన్న కథలు, ఐడియా బుక్‌ల రూపంలో తమ ఆలోచనలను పొందుపరచవచ్చు. ఈ డిజిటల్ ఐడియా బుక్‌ల రూపకల్పనకు కావాల్సిన అంశాలన్నింటినీ అప్లికేషన్‌లో పొందుపరిచామని కంపెనీ డెరైక్టర్ సమీర్ జైన్ తెలిపారు.

Tuesday, August 26, 2014

10 ఉచిత ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్‌లు



డిజిటల్ ఇంకా డీఎస్ఎల్‌ఆర్ కెమెరాలతో సాధ్యమయ్యే ఫోటోగ్రఫీని నేటితరం స్మార్ట్‌ఫోన్‌లు సాకారం చేస్తున్నాయి. ఫ్రంట్ ఇంకా రేర్ కెమెరాల ఆప్షన్‌లతో మార్కెట్లో లభ్యమవుతున్న స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లు అత్యుత్తమ ఫోటోగ్రఫీతో పాటు వీడియో కాలింగ్ సౌకర్యాన్ని చేరువ చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీకి మరిన్ని మెరుగులద్దుకునే క్రమంలో అనేక ఫోటోఎడిటింగ్ అప్లికేషన్‌లు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఆన్‌లైన్ ప్రపంచంలో లభ్యమవుతున్న 10 ఉచిత ఆన్‌లైన్ ఫోటోఎడిటింగ్ అప్లికేషన్‌లు


  1. VSCO Cam (iPhone, Android)
  2. Snapseed        
  3.  Adobe Lightroom (iPad)
  4. Instagram (iPhone, Android, Windows Phone)
  5. Pixlr Express (Android, iOS)
  6. Flickr (iPhone, Android, Windows Phone)
  7. Photo Editor by Aviary (Android, iOS, Windows Phone)
  8. Repix (Android, iOS)
  9. Litely (Android, iOS)
  10. Photo Studio (BlackBerry 10, Android)

Monday, August 25, 2014

స్పైస్ ఫైర్‌ఫాక్స్ ఫోన్@రూ.2,299

మొజిల్లా సంస్థ భాగస్వామ్యంతో ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ స్పైస్ మొబిలిటీ, ఫైర్‌ఫాక్స్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను స్పైస్ ఫైర్ వన్ ఎమ్ఐ-ఎఫ్ఎక్స్1 పేరుతో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. డ్యూయల్ సిమ్ కాన్ఫిగరేషన్, 3.5 అంగుళాల తాకే తెర, 1గిగాహెట్జ్ మొబైల్ ప్రాసెసర్ తదితర ప్రత్యేకతలను కలిగి ఉన్న ఈ ఫోన్ ధర రూ.2,299.

 
  • స్పైస్ ఫైర్ వన్ ఎమ్ఐ-ఎఫ్ఎక్స్1 (Spice Fire One Mi- FX1) కీలక ఫీచర్లు:
  • మొజిల్లా ఫైర్‌ఫాక్స్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం, 
  • 3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్480x 320పిక్సల్స్), 
  • డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 
  • 1గిగాహెట్జ్ మొబైల్ ప్రాసెసర్, 
  • 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 
  • 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 
  • కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, వై-ఫై, బ్లూటూత్). 
 
ప్రస్తుతం స్పైస్ ఫైర్ వన్ ఎమ్ఐ-ఎఫ్ఎక్స్1 స్మార్ట్ ఫోన్ ప్రముఖ రిటైలర్ స్నాప్‌డీల్ వద్ద ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యమవుతోంది.

ఫేస్ బుక్ సరికొత్త యాప్!

సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్ బుక్ సరికొత్త యాప్ ను లాంచ్ చేయనుంది. హాలీవుడ్ సెలబ్రిటీలతో మనం నేరుగా  మాట్లాడాలనుకుంటే ఫేస్ బుక్ ప్రవేశపెట్టే ఈ సరికొత్త యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే. అది కేవలం హాలీవుడ్ లో అత్యంత ప్రాధాన్యత ఉన్న ఎమ్మీ అవార్డులకు మాత్రమే. ఆగస్టు 25వ తేదీన జరుగనున్న 66 వ ఎమ్మీ అవార్డుల గాను ఈ యాప్ ను ప్రవేశపెట్టనున్నారు. ఆ యాప్ కు 'మెన్షన్స్ బాక్స్' గా నామకరణం చేసి మన ముందుకు తీసుకురానుంది.

దీంతో మీకు ఇష్టమైన నటీ నటులతో మాట్లాడే అవకాశం ఉంటుందని ఫేస్ బుక్ యాజమాన్యం స్పష్టం చేసింది. అంతే కాకుండా ఇది ట్యాబ్లెట్ యాప్ కావడంతో అందులో ఉన్న కెమెరా నుంచే నేరుగా వారిని చూసే అవకాశం కూడా ఉందట. దీంతో మనం ఆ వీడియోలో మనకు నచ్చిన సెలబ్రిటీని ఎంపిక చేసుకుని వారితో ముచ్చటించవచ్చని ఫేస్ బుక్ పేర్కొంది.

Saturday, August 23, 2014

స్మార్ట్‌ఫోన్‌కూ బీమా ధీమా..

అనధికారిక లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ప్రతి నెలా దాదాపు 20 లక్షల పైచిలుకు ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. అందుకే, వాహనాలకు, ఇంటికి, జీవితానికి ఉన్నట్లే మొబైల్ ఫోన్లకు కూడా ప్రస్తుతం బీమా పాలసీలు లభిస్తున్నాయి. బీమా కంపెనీలే కాకుండా ఫోన్లు విక్రయించే స్టోర్లు కూడా ఈ పాలసీలను అందిస్తున్నాయి.

పాలసీకి సంబంధించి ఒక్కో కంపెనీ వసూలు చేసే ప్రీమియం ఒక్కో రకంగా ఉంటోంది. సాధారణంగా ప్రతి రూ.1,000 కవరేజీకి ప్రీమియం సుమారు రూ. 15-20 దాకా ఉంటోంది. ఉదాహరణకు రూ. 40,000 ఖరీదు చేసే స్మార్ట్‌ఫోన్ బీమా కవరేజీ కోసం ప్రీమియం దాదాపు రూ. 600 - 800 దాకా ఉంటుంది. మొబైల్‌ఫోన్ చోరీకి గురైనా లేదా పోయినా.. క్లెయిమ్ పొందాలంటే ముందుగా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.

ఆ తర్వాత మొబైల్‌ను కొన్న బిల్లు, పోలీస్ ఎఫ్‌ఐఆర్‌ను.. బీమా కంపెనీకి గానీ లేదా గ్రూప్ పాలసీ ఇచ్చిన మొబైల్ స్టోర్‌కి గానీ అందజేయాలి. ఫోన్ పోయిన 48 గంటల్లోగా క్లెయిమ్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. క్లెయిము విషయంలో ఫోన్ విలువ తరుగుదల కూడా కీలకపాత్ర పోషిస్తుంది. సాధారణంగా కొన్న 90 రోజుల్లోగా ఫోన్ పోయి, క్లెయిమ్ కోసం దాఖలు చేస్తే బీమా కంపెనీలు తరుగుదలను లెక్కకట్టవు.

అదే 91 రోజుల నుంచి 180 రోజుల మధ్య కాలం అయితే ఫోన్ ఖరీదులో 25 శాతం మేర, 181 రోజులు గడిచిన తర్వాత 50 శాతం తరుగుదలను లెక్కగట్టి ఆ మేరకు క్లెయిమ్ మొత్తం ఇస్తాయి. అగ్నిప్రమాదం, దొంగతనం, ఇతరత్రా కొన్ని కారణాల వల్ల ఫోన్ దెబ్బతిన్నా ఫోన్‌కు పాలసీ రక్షణ ఉంటుంది. అయితే, వ్యక్తిగత నిర్లక్ష్యం కారణంగా పోగొట్టుకుంటే మాత్రం కవరేజీ ఉండదు.  కాబట్టి పాలసీ తీసుకుంటున్నప్పుడు ఇలాంటి అంశాలన్నీ చూసుకుని మాత్రమే తీసుకోవాలి.

మీ ఫోను తొందరగా చార్జింగ్ దిగిపోతుందా? అయితే ఈ చిట్కాలు మీకోసమే.

సాధారణంగా స్మార్ట్ ఫోన్‌లు వాడేవారికి బ్యాటరీ తొందరగా దిగిపోయే సమస్య తరచు ఎదురవుతుంటుంది. మనం ఫోన్ కొంటున్నపుడే తయారీదారు చెప్పినదానిపై ఆధారపడి కాకుండా బ్యాటరీ గురించి ఇప్పటికే ఫోన్‌ కొని వాడినవారిని అభిప్రాయం తీసుకోవడం మంచిది. అలాగే ఈ సమస్యకు పరిష్కారంగా బ్యాటరీ సేవర్ అప్లికేషన్‌లు, ఆప్టిమైజర్లు వాడుతుంటారు. అవి వాడడం వలన బ్యాటరీ సామర్ధ్యం పెద్దగా మార్పు ఏమి లేకపోవడం మనం గమనించవచ్చు. అలాగే కొన్ని అప్లికేషన్‌లు అయితే బ్యాటరీ మెరుగుపరచడం మాట దేవుడెరుగు బ్యాటరీ ఇంకా తొందరగా దిగిపోతుంటుంది. ఏటువంటి అధనపు అప్లికేషన్లు ఇన్‌స్టాల్ చేయనవసరం లేకుండానే సులువైన చిట్కాలను పాటించడం ద్వారా మనం బ్యాటరీని ఆధా చేసుకోవచ్చు. 
        మొదట మనం చేయవలసినది ఏ అప్లికేషన్‌లు ఎక్కువ బ్యాటరీని వాడుకుంటున్నాయో చూసి అవి మనకు అవసరం లేదనుకుంటే తీసివేయడం. సెట్టింగ్స్ లో బ్యాటరీ లోకి వెళితే మనం ఏ అప్లికేషన్‌లు ఎక్కువ బ్యాటరీని వాడుకుంటున్నాయో చూడవచ్చు. ఫోను డిఫాల్ట్ అప్లికేషన్‌లు కాకుండా వేరే అప్లికేషన్‌లు బ్యాటరీని వాడకంలో చూపించకపోతే మనం చేయవలసింది ఏమి ఉండదు.
      సాధారణంగా ఫోనులో బ్యాటరీని ఎక్కువగా వాడుకొనేది స్క్రీన్. తెర వెలుగును ఆటోలో పెట్టడం ద్వారా కొంత, మనకు చూడడానికి ఇబ్బంది లేకుండా మరింత తక్కువ వెలుగును పెట్టుకోవడం ద్వారా మరింత బ్యాటరీ ఆధా చేయవచ్చు. AMOLED డిస్‌ప్లే కలిగిఉన్న ఫోన్‌లలో (సాధారణంగా సాంసంగ్ ఫోన్‌లు ఈ డిస్‌ప్లేతో వస్తాయి) నలుపు రంగు ఎక్కువగా ఉండే వాల్‌పేపర్లు, థీమ్‌లు వాడతున్నపుడు మామూలు కన్నా తక్కువగా బ్యాటరీ ఖర్చు అవుతుంది.
      తెర తరువాత ఫోన్ బ్యాటరీని ఎక్కువ వాడుకొనేవి మన ఫోన్‌లో ఉన్న డివైజ్‌లు. అవసరం లేనప్పుడు మొబైల్ నెట్‌వర్క్, వైఫి, బ్లూటూత్, జిపియస్, యన్‌ఎఫ్‌సి(లొకేషన్ సర్వీస్) మరియు ఆటోరొటేషన్ అపిఉంచడం వలన బ్యాటరీ సామర్ధ్యం గణనీయంగా మెరుగుపడుతుంది.


            అనవసర అప్లికేషన్‌లు తొలగించడం, నిరంతరం వెనుక నడుస్తుండే అప్లికేషన్‌లు సంఖ్య తగ్గించడం వలన, నెట్వర్క్ సెట్టింగులలో రెస్ట్రిక్ట్ బ్యాక్‌గౌండ్ డాటాని ఎంచుకోవడం, ఆటో సింక్రనైజేషన్ అవసరంలేనపుడు ఆపిఉంచడం వలన కూడా బ్యాటరీ సామర్ధ్యం మెరుగుపడుతుంది.
          హోం స్క్రీన్ పై ఎక్కువ విడ్జెట్‌లు ఉండడం మరియు ఎక్కువ హోం స్క్రీన్‌లు ఉండడం కూడా బ్యాటరీని ప్రభావితం చేస్తుంది. కనుక అవసరంలేని విడ్జెట్లు, హోం స్క్రీన్‌లను తొలగించడం వలన బ్యాటరీని అధా చెయ్యవచ్చు.

                
            మనం ఫ్లేస్టోర్ నుండి అప్లికేషన్‌లను ఇంస్టాల్ చేసినపుడు డిఫాల్ట్ గా హోం స్ర్కీన్ పై విడ్జెట్లు వస్తాయి. ఈ విధంగా హోం స్ర్కీన్ పై అనవసరపు వెడ్జెట్ల సంఖ్య పెరిగిపోతుంది. ఆలా జరక్కుండా క్రింది చిత్రంలో చూపించిన ప్లే స్టోర్ సెట్టింగ్ ని మార్చుకోవడం ద్వారా చేయవచ్చు.


       అవసరం లేదనుకుంటే కీబోర్డ్, టచ్ వైబ్రేషన్‌, సౌండ్ లను తీసివేయడం ద్వారా, నోటిఫికేషన్ వైబ్రేషన్‌ ఆపివేయడం ద్వారా కొంత బ్యాటరీ అధా చేయవచ్చు.


        లైవ్ వాల్‌పేపర్లు కూడా బ్యాటరీని బాగా తింటాయి కనుక మామూలు చిత్రాన్ని వాల్ పేపర్ గా పెట్టుకోవడం మంచిది.


             
           డెవలపర్ ఆప్షన్లలో ఉన్న యానిమేషన్‌లను తగ్గించడం లేదా ఆపివేయడం వలన కూడా బ్యాటరీని కొంత వరకు అధా చేయవచ్చు.


             ఆండ్రాయిడ్ పరికరాల్లో బ్యాటరీ సామర్ధ్యన్ని మెరుగుపరచడానికి గూగుల్ చేపట్టిన ప్రాజెక్ట్ ఒల్టా వలన ఈ మధ్య విడుదలైన ఆండ్రాయిడ్ వెర్షన్‌లలో బ్యాటరీ నిలిచి ఉండే సామర్ధ్యం గణనీయంగా మెరుగుపడింది కనుక మీ ఫోన్‌కి అప్‌డేట్ విడుదలైతే తప్పక అప్‌డేట్ చేసుకోవడం మంచిది.

          డెవలపర్లు అప్లికేషన్‌ల పనితీరు మెరుగుపరుస్తు నిరంతరం కొత్త వెర్షన్‌లను విడుదలచేస్తుంటారు కనుక మన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయబడిన అప్లికేషన్‌లను కూడా ఎప్పుడు అప్డేట్‌గా ఉంచుకోవాలి.

             ఫోన్ తో వచ్చిన సాఫ్ట్‌వేర్ కంటే ఆండ్రాయిడ్ కస్టమ్‌ రామ్‌ సైనోజెన్ మోడ్ ఇన్‌స్టాల్ చేసిన తరువాత ఫోన్ బ్యాటరీ సామర్ధ్యం గణనీయంగా మెరుగుపడడం నా ఫోన్‌ లో ప్రత్యక్షంగా చూడడం జరిగింది. కనుక మీ ఫోన్ కి సైనోజెన్ మోడ్ అధికారిక మద్దతు ఉండి, వారెంటీ గడువు ముగిసిపోతే సైనోజెన్ మోడ్ ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా బ్యాటరీ సామర్ధ్యాన్ని పెంచుకోవచ్చు.

Friday, August 22, 2014

వ్యాపార ప్రకటనలు(యాడ్స్)లేని, వేగవంతమైన వెబ్ బ్రౌజింగ్ కోసం

మనం ఒక వెబ్ సైట్ ని సందర్శించినపుడు మనకి కావలసిన విషయాలతో పాటుగా చాలారకాల ప్రకటనలు(flash adds,text adds) కనిపిస్తుంటాయి. వీటివలన వాడుకరికి విసుగు తో పాటు ఆ వెబ్ పేజి నెమ్మదిగా లోడ్ కావడం,విలువైన సమయం మరియు బాండ్ విడ్త్ వృధా అవుతాయి. ఈ సమస్యకు చక్కని పరిష్కారం ABP(యాడ్ బ్లాక్ ప్లస్)యాడ్ ఆన్. దీన్ని ఫైర్ ఫాక్స్ మరియు గూగుల్ క్రోం లో ఇక్కడ నుండి ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఇన్ స్టాల్ అయిన తరువాత కావలసిన ఫిల్టర్ ను సబ్ స్రైబ్ చెసుకోవడంద్వారా అవాంచిత  ప్రకటనలు అరికట్టవచ్చును.
ఫిల్టర్ ను సబ్ స్రైబ్ చెసుకోవడం
నేరుగా ప్రకటనలని బ్లాక్ చెయ్యడం
ABP కి ముందు

ABP తరువాత
చూసారుగా యాడ్ బ్లాక్ ప్లస్ వాడిన తరువాత వెబ్ పేజి ఎంత పొందికగా ఉందో,మరి ఆలస్యం ఎందుకు విలువైన మీకాలాన్ని,బాండ్ విడ్త్ ని ఆదాచేసుకోండి.

ఫోన్‌ నుండి మరొక ఫోన్‌కి, టాబ్లెట్‌కి మరియు కంప్యూటరుకి వేగంగా ఫైళ్ళు పంపించుకోవడానికి

సాధారణంగా ఒక ఫోన్‌ నుండి మరొక ఫోన్‌కి ఫైళ్ళను పంపించుకోవడానికి మనం బ్లుటూత్ వాడుతుంటాము. అలాగే ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు ప్రతిసారి డౌన్‌లోడ్ చేసుకోకుండానే మరొక ఫోన్‌ నుండి పంపించుకోవడానికి బ్లుటూత్ ఆధారిత అప్లికేషన్‌లను వాడుతుంటాము. అయితే ఎక్కువ పరిమాణం గల ఫైళ్ళను లేదా అప్లికేషన్‌లను ఇలా బ్లుటూత్ ద్వారా పంపించుకోవడానికి చాలా సమయం పడుతుంది. అటువంటప్పుడు మన ఫోన్‌లో ఉన్న వైఫిని ఉపయోగించుకుంటే మనం బ్లుటూత్ కన్నా 40 రెట్లు వేగంగా ఫైళ్ళను పంపించుకోవచ్చు.

దీనిని మనం ప్లేస్టోర్‌లో ఉచితంగా లభించే లినోవో వారి షేర్ ఇట్ అన్న యాప్ ని ఉపయోగించి సులభంగా చేయవచ్చు. 
 

ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెడిదే ఫోన్ త్వరగా ఛార్జ్ అవుతుంది

అర్జెంటుగా బయటకు వెళ్లవలసి వచ్చింది... అదే సమయంలో మీ ఫోన్ ఛార్జింగ్ నిండుకుంది. ఇప్పుడు ఏం చేస్తారు..?, మీ ఫోన్ త్వరగా ఛార్జ్ అవటానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా..? మీ ఫోన్ వేగవంతంగా ఛార్జ్ చేసుకునేందుకు ఓ మార్గాన్ని techansintelugu.blogspot.com మీకు సూచిస్తోంది. 
మీ ఫోన్ వేగవంతంగా ఛార్జ్ అవ్వాలంటే ముందు ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేయండి. తరువాతి క్రమంలో వైర్‌లెస్ కనెక్షన్‌లను ఆఫ్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్‌లోని వాయిస్ కాలింగ్, ఇంటర్నెట్ ఫీచర్లు పూర్తిగా బంద్ అయిపోతాయి. ఫోన్ ఛార్జింగ్ నిమిషాల వ్యవధిలోనే పూర్తి అవుతుంది. ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెడిదే ఫోన్ త్వరగా ఛార్జ్ అవుతుంది కొన్ని సందర్భాల్లో మొబైల్ ఫోన్‌లు పూర్తిగా చార్జ్ అయ్యేందుకు నిర్ధేశిత సమయం కంటే అధిక సమయాన్ని తీసుకుంటాయి.
అయితే, ఈ జాప్యానికి గల కారణాలు చాల మందికి తెలియదు. ఫోన్ వేగవంతంగా చార్జ్ అయ్యేందుకు పాటించాల్సిన నిబంధనలను ఇప్పుడు తెలుసుకుందాం....
  • ఫోన్ వేగవంతంగా చార్జ్ అవ్వాలంటే సదరు చార్జర్‌ను నేరుగా అవుట్ లెట్‌కే అనుసంధానించండి. కంప్యూటర్ ద్వారా చార్జింగ్ అంత ఉపయుక్తమైనది కాదు. 
  • చార్జింగ్‌కు సిద్ధమయ్యే క్రమంలో ఫోన్‌లో రన్ అవుతున్న అప్లికేషన్‌లను ఆఫ్ చేయటం మంచిది. ముఖ్యంగా జీపీఎస్, బ్లూటూత్ వంటి అప్లికేషన్‌లను టర్న్‌ఆఫ్ చేయాలి. 
  • ఫోన్ స్ర్కీన్‌ను టర్న్‌ఆఫ్ చేయండి. 
  • చార్జింగ్ సమయంలో మీ ఫోన్ వైబ్రేషన్ మోడ్‌లో ఉన్నట్లయితే సాధారణ సౌండ్ మోడ్‌కు తీసుకురండి. 
  • చార్జింగ్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో మ్యూజిక్ వినటం అంత శ్రేయస్కరం కాదు.

Thursday, August 14, 2014

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలను లాక్ చేయాలంటే..?

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలను రహస్యంగా ఉంచాలనుకుంటున్నారా..?, ఫోన్‌లోని మీ రహస్య డాటాను ఎవరికంటా పడకుండా నిక్షిప్తంగా భద్రపరిచేందుకు పలు ఉచిత ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు సిద్ధంగా ఉన్నాయి. వీటిని ఇన్స్‌స్టాల్ చేసుకున్నట్లయితే హ్యాండ్‌సెట్‌ను నిక్షేపంగా టేబుల్ పై వదిలి వెళ్లొచ్చు.

హైడ్ పిక్షర్స్ ఇన్ వాల్టీ (Hide Pictures in Vaulty): 
ఈ ఉచిత ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌‍లోని ఫోటోలతో పాటు వీడియోలను భద్రపరుచుకోవచ్చు. ముందుగా అప్లికేషన్ ఓపెన్ చేసి భద్రపరచాల్సిన ఫోటోలు లేదా వీడియోలను ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. దింతో మీరు భద్రపరచాల్సిన డాటా ప్రత్యేకమైన ప్రయివేటు గ్యాలరీలోకి వచ్చి చేరుతుంది. పాస్‌వర్డ్ ఇంకా పిన్ భద్రత. వ్యూ, సెర్చ్, జూమ్, ఫిల్టర్, రీనేమ్ ఫోటోస్ వంటి ఫీచర్లను ఈ అప్లికేషన్ కల్పిస్తుంది. గూగుల్ ప్లేస్టోర్‌లో ఈ యాప్ లభ్యమవుతోంది. 
డౌన్‌లోడ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
 
హైడ్ ఇట్ ప్రో (Hide It Pro): 
ఈ ఉచిత ఆండ్రాయిడ్ అప్లికేషన్ మీ ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలు, అప్లికేషన్స్, మెసేజస్ ఇంకా కాల్ డాటాను ఎవకి కంటా పడకుండా హైడ్ చేస్తుంది. అత్యుత్తమ సర్వీస్‌ను ఈ యాప్ ద్వారా పొందవచ్చు. ఆడియో మేనేజర్ అప్లికేషన్ ప్రధాన ఆకర్షణ. పిన్ ఇంకా పాస్‌వర్డ్ సౌలభ్యత. పొందుపరిచిన ఎన్‌క్రిప్షన్ టూల్ మీ డాటాకు మరింత భద్రత కల్పిస్తుంది. గూగుల్ ప్లేస్టోర్‌లో ఈ యాప్ లభ్యమవుతోంది. 
డౌన్‌లోడ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
 
హైడ్ పిక్షర్స్- కీప్‌సేఫ్ వాల్ట్ (Hide pictures - KeepSafe Vault): 
ఈ అప్లికేషన్ ద్వారా మరింత సులభంగా మీ ఫోన్‌లోని ఫోటో ఇంకా వీడియో ఫైళ్లను భద్రపరుచుకోవచ్చు. ఎన్‌క్రిప్షన్ ఫీచర్ లేదు. పిన్‌కోడ్ ఆధారంగా పని చేస్తుంది. గూగుల్ ప్లేస్టోర్‌లో ఈ యాప్ లభ్యమవుతోంది. 
డౌన్‌లోడ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
 
వాల్ట్ - హైడ్ ఎస్ఎంఎస్, పిక్షర్స్ & వీడియోస్ (Vault-Hide SMS, Pics & Videos): 
ఈ అప్లికేషన్ పెద్ద సంఖ్యలో ప్రైవసీ అప్షన్‌లను కలిగి ఉంది. ఎన్‌క్రిప్టిడ్ విధానం ద్వారా ఫోటోలతో పాటు వీడియోలను భద్రపరుచుకోవచ్చు. పాస్‌వర్డ్ ప్రొటెక్సన్, కాంటాక్ట్ సమాచారంతో పాటు టెక్స్ట్ సందేశాలు, కాల్ హిస్టరీని హైడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్‌లో ఈ యాప్ లభ్యమవుతోంది. 
డౌన్‌లోడ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఫోన్ కాల్స్ బ్లాక్ చేయటమెలా..?

అనవసరమైన ఫోన్ కాల్స్‌తో విసిగివేసారిపోతున్నారా..? మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఇటువుంటి అనవరస ఫోన్ కాల్స్‌ను బ్లాక్ చేసేందుకు ప్రత్యేకమైన వెసలబాటు ఉంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో కాల్స్ బ్లాక్ చేసే విధానాన్ని ఇప్పుడు చూద్దాం...
- ముందుగా ఫోన్ మెనూ ఆప్షన్స్‌లోకి ప్రవేశించిండి తరువాతి క్రమంలో కాల్ సెట్టింగ్స్ ఆప్షన్స్ ఎంపిక చేసుకోండి. 
- కాల్ సెట్టింగ్స్‌లోకి ప్రవేశించిన పిదప కార్ రిజెక్షన్ ఆప్సన్ పై క్లిక్ చేయండి. 
- ఇప్పుడు మెనూలో ‘ఆటో రిజెక్ట్ మోడ్', ‘ఆటో రిజెక్ట్ లిస్ట్' అనే రెండు ఆప్షన్‌లు ప్రత్యక్షమవుతాయి. 
- వాటిలో ఆటో రిజెక్ట్ లిస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేసి అనవసరమైన ఫోన్ కాల్స్ జాబితాను ఆ లిస్ట్‌లో పొందుపరచాలి. 
 
 కాల్స్ బ్లాక్ చేసేందుకు ఉచిత ఆండ్రాయిడ్ అప్లికేషన్స్: 
మిస్టర్. నంబర్ టెక్స్ట్, కాల్ & బ్లాక్ (ఫ్రీ): 
ఈ ప్రత్యేకమైన అప్లికేషన్ ద్వారా ఉచిత కాలింగ్ ఇంకా ఉచిత సందేశాలను పంపుకోవచ్చు. కాల్స్ ఇంకా సందేశాలను బ్లాక్ చేసేందుకు ఈ శక్తివంతమైన అప్లికేషన్ తోడ్పడుతుంది. 
కాల్ కంట్రోల్ - కాల్ బ్లాకర్ (ఫ్రీ): 
 
ఈ ఆండ్రాయిడ్ కాల్ బ్లాకర్ అప్లికేషన్ మీ ఫోన్‌‍కు వచ్చిన అనవసర కాల్స్‌ను సమర్థవంతంగా బ్లాక్ చేసేస్తుంది.

ఫేస్‌బుక్‌లోని కామెంట్‌లను ఎడిట్ చేయటం ఏలా..?

ప్రఖ్యాత సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ కోట్లాది మంది యాక్టివ్ యూజర్లతో విరాజిల్లుతోంది. ఈ సైట్‌లోని ప్రతి యూజర్‌కు సగటున 200మంది స్నేహితులు ఉంటారు. ఫేస్‌బుక్ ద్వారా రోజుకు కొన్ని లక్షలు సంభాషణలు చోటుచేసుకుంటున్నాయి. 
ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకన్న ఫేస్‌బుక్ యాజమాన్యం ఇటీవల ‘ఎడిట్ కామెంట్ ఫీచర్'ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ అందుబాటులోకి రాకముందు ‘కామెంట్‌ను ఎడిట్ చేసుకునేందుకు వీలు ఉండేది కాదు, డిలీట్ చేసి కొత్తతి పోస్ట్ చెయ్యాల్సి వచ్చేది'. ఈ కొత్త అప్లికేషన్ రాకతో చేసిన కామెంట్‌లో ఏమైన అక్షరదోషాలు తలెత్తితే ఎడిట్ చేసి రీపోస్ట్ చేసుకోవచ్చు.


కామెంట్‌ను ఎడిట్ చేసుకునే విధానం: ముందగా మీరు చేసిన కామెంట్ దగ్గరికి వెళ్లండి. కామెంట్ పై కర్సర్ పెట్టిన వెంటనే కుడిభాగంలో పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది. పెన్సిల్ ఐకాన్‌ను క్లిక్ చేసిన వెంటనే ‘ఎడిట్ ఆర్ డిలిట్' ఆప్షన్ ప్రత్యక్షమవుతుంది. ఎడిట్ ఆప్షన్ ఎంపిక చేసుకోండి. అక్షరదోషాలను సవరించి తిరిగి మీ కామెంట్‌ను రీపోస్ట్ చెయ్యండి.
404 ఎర్రర్ అనేది ఇంటర్నెట్‌కు సంబంధించిన పదం. వెబ్‌పేజ్ కెనాట్ ఫౌండ్ (webpage cannot found) అనే అర్థాన్ని ఈ ఎర్రర్ సూచిస్తుంది. ఉదాహరణకు: ఇంటర్నెట్‌లో ఓ అంశానికి సంబంధించి యూఆర్ఎల్ లింక్‌ను సృష్టించటం జరిగింది. అయితే, ఆ లింక్‌ను తరువాతి క్రమంలో ఇంటర్నెట్ నుంచి తొలిగించారు. తొలగించబడిన యూఆర్ఎల్ లింక్‌ను మరల ఇంటర్నెట్ బ్రౌజర్‌లో టైప్ చేసినట్లయితే ‘404 ఎర్రర్'(404 Error) స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది. 404 ఎర్రర్ మీ ఇంటర్నెట్ బ్రౌజర్ పై ప్రత్యక్షమైదంటే మీ సెర్చ్ చేసిన పేజీ లేదని, ఎప్పుడో తొలగించబడిందని అర్ధం చేసుకోవచ్చు.

మీ స్మార్ట్‌ఫోన్‌లో స్ర్కీన్‌షాట్‌లను చిత్రీకరించటం ఏలా..?

మీ స్మార్ట్‌ఫోన్‌లో స్ర్కీన్‌షాట్‌లను చిత్రీకరించుకోవటం చాలా సులువు. మీరువాడే స్మార్ట్‌ఫోన్ మోడల్‌ను బట్టి పలు కమాండ్‌లను ఉపయోగించటం ద్వారా స్ర్కీన్‌షాట్‌ క్యాప్చూరింగ్ ప్రక్రియ చాలా సులభరతంగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లలో స్ర్కీన్‌షాట్‌లను చిత్రీకరించుకునేందుకు అనేకమైన అప్లికేషన్‌లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే, ఏ విధమైన అదనపు అప్లికేషన్‌ల అవసరం లేకాండనే స్ర్కీన్‌షాట్‌‌లను క్యాప్చర్ చేసుకోవచ్చు. అవి ఏలాగో ఇప్పుడు చూద్దాం......

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో స్ర్కీన్‌షాట్‌లను చిత్రీకరించుకోవటం ఏలా..? 
  1. ముందుగా మీ ఫోన్ అన్‌లాక్ చేయండి. 
  2. స్ర్కీన్ షాట్ కావాలనుకున్న ప్రదేశానికి వెళ్లండి. 
  3. తరువాతి చర్యగా పవర్‌బటన్ ఇంకా వాల్యుమ్ బటన్‌లను ఒకేసారి ప్రెస్ చేయండి. 
  4. సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో స్ర్కీన్‌షాట్‌లను చిత్రీకరించుకోవాలంటే పవర్+హోమ్ బటన్‌లను ప్రెస్ చేసి ఉంచాలి. 
  5. ఇప్పుడు మీరు క్యాప్చర్ చేసిన స్ర్కీన్‌షాట్ స్ర్కీన్ షాట్ ఇన్ ద గ్యాలరీ అనే ఫోల్డర్‌లో స్టోర్ కాబడి ఉంటుంది. 

యాపిల్ స్మార్ట్‌ఫోన్‌లలో స్ర్కీన్‌షాట్‌లను చిత్రీకరించుకోవటం ఏలా..? 
  1. ముందుగా డిస్‌ప్లే పై స్ర్కీన్‌షాట్ క్యాప్చర్ చేయాలనుకుంటున్న ప్రదేశానికి వెళ్లండి. 
  2. తరువాతి చర్యగా పవర్ బటన్ + హోమ్ బటన్‌లను ఒకేసారి ప్రెస్‌చేసి ఉంచండి. 
  3. క్యాప్చర్ చేయబడిన స్ర్కీన్‌షాట్‌లను ఫోటో రోల్‌లో బ్రౌజ్ చేసుకోవచ్చు. 

విండోస్ స్మార్ట్‌ఫోన్స్ (నోకియా లూమియా సిరీస్): 
  1. ముందుగా డిస్‌ప్లే పై స్ర్కీన్‌షాట్ కావాలనుకున్న ప్రదేశానికి వెళ్లండి.
  2. ఇప్పుడు పవర్ బటన్ + విండోస్ కీ బటన్‌లను ఒకే‌సారి ప్రెస్‌చేసి ఉంచండి. 

బ్లాక్‌బెర్రీ 10 స్మార్ట్‌ఫోన్‌లో స్ర్కీన్‌షాట్‌లను చిత్రీకరించుకోవటం ఏలా..?  
  1. ముందుగా డిస్‌ప్లే పై స్ర్కీన్‌షాట్ కావాలనుకున్న ప్రదేశానికి వెళ్లండి. 
  2. తరువాతి చర్యగా ఒకే సమయంలో అప్ ఇంకా డౌన్ కీలను ప్రెస్ చేయటం ద్వారా స్ర్కీన్ క్యాప్చర్ అవుతుంది.

ఫేస్‌బుక్ అకౌంట్‌ను శాస్వుతంగా తొలగించాలంటే..?

పలు అనివార్య కారణాల రిత్యా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను శాస్వుతంగా డిలీట్ చేద్దామనుకుంటున్నారా..? సాధారణంగా, ఫేస్‌బుక్ అకౌంట్‌ను డిలీట్ చేద్దామన్న ఆలోచన వచ్చిన వెంటనే చాలా మంది అకౌంట్ సెట్టింగ్స్ (Account Settings) లోకి ప్రేవేశించి సెక్యూరిటీ (security) విభాగాంలోని Deactivate your Account ఆప్షన్‌ను క్లిక్ చేస్తుంటారు. 
అయితే, ఇలా చేయటం వల్ల ఫేస్‌బుక్ సర్వీస్‌ను మీ టైమ్‌లైన్ అదృశ్యమైనప్పటికి మీ ఫేస్‌బుక్ డేటా సర్వర్‌లో అలానే ఉండి పోతోంది. ఈ క్రమంలో గతంలో మీరు మీ అకౌంట్ నుంచి మీరు షేర్ చేసిన డేటా ఇతరుల అకౌంట్‌లలో అలానే ఉండిపోతుంది. ఇలా కాకుండా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను సర్వర్ నుంచే పూర్తిగా తొలగించివేయాలంటే ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగినై ఆ తరువాత వేరొక ట్యాబ్‌లో ఈ క్రింది లింక్‌ను ఓపెన్ చేసి తదుపరి సూచనలను అనుసరిచండి. 
 
ఈ ప్రక్రియ ద్వారా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను డిలీట్ చేసేందుకు ధరఖాస్తు చేసుకున్నట్లయితే 14 రోజుల తరువాత మీ అకౌంట్ పూర్తిగా డిలీట్ కాబడుతుంది

తాజా రీచార్జి ఆఫర్లు తెలిపే android app - iReff

మీరు మీ ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జి చేసే ముందు ఓ క్షణం ఆగండి. మీ అవసరానికి తగిన రీచార్జి ప్రొడక్టు/ధర ఏదో చూసి మరీ ఎంచుకోండి. అయితే ఎలా అన్న ప్రశ్న వస్తుంది. మీ దగ్గర ఓ యాండ్రాయిడ్ ఫోన్ ఉన్నట్లయితే.. అందులో iReff అప్లికేషన్ ఇన్ స్టాల్ చేసుకుంటే చాలు. ఇది తాజా రీచార్జి ఆఫర్లు, ఏ ప్లాన్ వేసుకుంటే ఎలాంటి లాభాలు అన్న విషయాలను చక్కగా వివరిస్తుంది.


  • Topup, SMS, Data(GPRRS/2G మరియు 3G), Local, STD, ISD ఇలా పలు సాధారణ కేటగిరీల వారీగా మీరు సమాచారం సరిచూసుకోవచ్చు. లేదంటే శక్తిమంతమైన text search  సౌకర్యం ఉపయోగించి కూడా మీ అవసరానికి తగిన ఆఫర్ ఎంచుకోవచ్చు.
  • మీరు Topup వోచర్లు, ప్రత్యేక టారిఫ్ వోచర్లు, కాంబో వోచర్లు ఇలా చాలా వివరాలు ఇందులో పొందొచ్చు.
  • డేటా ఏ రోజుకారోజు ఇందులో అప్డేట్ అవుతుంది.  బీఎస్ఎన్ఎల్ మాత్రం  ఇంకా ప్రయోగదశలో ఉంది.
iReff ప్రస్తుతం అన్ని టెలికం సర్కిళ్లలో కింది వాటికి సంబంధించిన సమాచారం అందిస్తోంది:



  •  Airtel latest plan for 3g and 2g and talktime
  •  Aircel latest plan for 3g and 2g and talktime
  •  BSNL / MTNL 
  •  Idea
  •  Loop Mobile
  •  MTS
  •  Reliance GSM
  •  Reliance CDMA
  •  Tata Docomo
  •  Tata Indicom
  •  T24
  •  Uninor
  •  Videocon
  •  Virgin Mobile CDMA
  •  Virgin Mobile GSM
  •  Vodafone

ఫ్రీకాల్, ఆఫ్‌లైన్ వాయిస్ కాలింగ్ సర్వీస్!

బెంగుళూరుకు చెందిన ముగ్గరు ఇంజనీరింగ్ విద్యార్థులు ‘ఫ్రీకాల్'( FreeKall) పేరుతో ఆఫ్‌లైన్ వాయిస్ కాలింగ్ సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చారు. 
ఈ ఉచిత వాయిస్ కాలింగ్ సర్వీసును ఇంటర్నెట్‌తో పనిలేకుండా ఉపయోగించుకోవచ్చు. ఈ సర్వీస్ రూపకల్పనలో బెంగుళూరుకు చెందిన యువ ఇంజినీర్లు యషస్ సీ శేఖర్, యూ. విజయకుమార్, ఇ.సందేశ్‌లు కీలక పాత్ర పోషించారు. 
 

ఫ్రీకాల్ సర్వీసును ఏలా ఉపయోగించుకోవాలి..? 
ఫ్రీకాల్ సర్వీసులను ఉపయోగించుకోవాలనకునే వారు ముందుగా తమ మొబైల్ ఫోన్ నుంచి ఫ్రీకాల్ సంస్థ టోల్ ఫ్రీ నంబర్‌కు మిస్సుడ్ కాల్ ఇవ్వాలి.( ఫ్రీకల్ కాల్ సంస్థ టోల్ ఫ్రీ నంబర్లు 080-67683693, 080-67683693) . కొద్ది సెకన్లు తరువాత అదే నంబర్ నుంచి మీ మొబైల్ నంబర్‌కు కాల్ వస్తుంది. ఆ సమయంలో మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో వారి ఫోన్ నంబర్‌ను జతచేసి డయల్ చేస్తే ఆ నంబర్‌కు ఫ్రీకాల్ ద్వారా కాల్ కనెక్ట్ అవుతుంది. 
ఫ్రీకాల్ మాట్లాడే సమయంలో ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి 10 సెకన్ల నిడివిగల వాణిజ్య ప్రకటనలను ఆడియో రూపంలో మీకు వినిపించబడతాయి. ఈ యాడ్‌లను ప్రసారం చేసినందుకు గాను ఆయా కంపెనీలు ఫ్రీకాల్ సంస్థకు డబ్బు చెల్లిస్తాయి. ఫ్రీకాల్ సర్వీసులో సభ్యత్వం తీసుకున్న వారు ఒక రోజులో 12 నిమిషాలు పాటు ఉచితంగా మాట్లాడుకోవచ్చు. ఆ 12 నిమిషాల వ్యవధిలో దేశంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఫ్రీకాల్ చేసుకోవచ్చు. ఈ సర్వీసును ఉపయోగించుకోవాలనుకుంటున్న ఔత్సాహికులు www.freekall.com లోకి లాగినై తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.

నోకియా లూమియా 530@రూ.7,349

లూమియా సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో ఆవిష్కరించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నోకియా, ‘లూమియా 530' పేరుతో మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.7,349. గురువారం నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు లూమియా సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో లూమియా 520 (రూ.8,000) తక్కువ ధర ఫోన్ కాగా, తాజాగా లూమియా 530 (రూ.7,349) ఆ స్థానాన్ని భర్తీ చేసిందని మైక్రోసాఫ్ట్ మొబైల్స్ అనుబంధ నోకియా ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ విరాల్ ఓజా తెలిపారు. నోకియా లూమియా 530 కీలక ఫీచర్లు.... 
 
  • డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 
  • 4 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480 పిక్సల్స్), 
  • విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, 
  • 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్, 
  • అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 
  • 512 ఎంబి ర్యామ్, 
  • 4జీబి ఇంటర్నల్ మెమరీ, 
  • మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 
  • కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్), 
  • 1430 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

షేకీ వీడియోలను సరిచేస్తుంది!

సైకిల్ తొక్కుతూ లేదా మెట్లు ఎక్కుతూ లేదా అటూ ఇటూ తిరుగుతూ ‘గోప్రో’ వంటి కెమెరాలతో వీడియోలు తీశారా? కెమెరా కదిలినప్పుడల్లా వీడియోల్లోని దశ్యాలు షేక్ అవుతున్నాయా? అయితే ఆ సమస్యను ఫిక్స్ చేసేందుకు మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచి ‘హైపర్‌లాప్స్’ అనే కొత్త సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి వచ్చింది. ఈ సాఫ్ట్‌వేర్ మూడు దశల్లో పనిచేస్తుంది. మొదట ప్రతి సీన్‌లో ముఖ్యమైన ఫీచర్స్‌ను విశ్లేషించి ఓ వీడియోను సుమారు అంచనాతో పునర్‌నిర్మిస్తుంది.

రెండోదశలో కెమెరా కదలికలు లేకుండా స్మూత్ ఫ్రేమ్‌లతో వర్చువల్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుంది. చివరగా తొలుత రూపొందించిన వీడియోను ఈ స్మూత్ ఫ్రేమ్‌లతో కూడిన కెమెరా పాత్‌లో బంధిస్తుంది. ఒరిజినల్ ఫుటేజీలో లేని అదనపు ఫ్రేములను ఉత్పత్తి చేసి కెమెరా జంప్‌లను తీసేస్తుంది. దీంతో షేక్ అయ్యే వీడియో.. స్మూత్‌గా ప్లే అయిపోతుంది. అయితే ఇలాంటి ఇమేజ్-స్టెబిలైజేషన్ సాఫ్ట్‌వేర్‌లు మార్కెట్లోకి ఇంతకుముందే కొన్ని వచ్చినప్పటికీ, వాటి కన్నా ఈ కొత్త సాఫ్ట్‌వేర్ చాలా వేగంగా, సమర్థంగా పనిచేస్తుందని దీని రూపకర్తలు చెబుతున్నారు.

ఢీకొట్టండి... పారిపోండి! మంచి గేమ్

రోడ్డుపై వేగంగా కారు నడపాలని, ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి అడ్డదిడ్డంగా దూసుకుపోవాలని అనిపిస్తుందా? నిజంగా అలా చేస్తే గనక.. ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు వడ్డిస్తారు. ప్రమాదాలు జరిగి మనకు దెబ్బలు తగలడమో, అవతలివారికి తగిలితే జైలుకు పోవడమో ఖాయం. అదే ఫోన్‌లో అయితే? మన కారు.. మన ఇష్టం. నచ్చిన వేగంతో మెచ్చిన రోడ్డుపై అడ్డదిడ్డంగా దూసుకుపోవచ్చు. హెవీ ట్రాఫిక్‌లో ప్రత్యేకమైన రంగుల్లోనే ఉన్న వాహనాలు ఢీకొడుతూ స్పోర్ట్స్ కారుతో నడిరోడ్డుపై వీరవిహారం చేయొచ్చు.

లేదా కామ్‌గా, చాకచక్యంగా డ్రైవ్ చేయొచ్చు. దీనికి టిల్ట్ లేదా టచ్.. రెండు ఆప్షన్లూ ఉన్నాయి. అందువల్ల మనం ఉన్న పొజిషన్‌కు అనుగుణంగా ఈ గేమ్ తనకు తాను టిల్ట్(రొటేట్) అవుతుంది. ఈ ఉచిత ఆప్ ఐఫోన్, ఐపాడ్, ఐపాడ్‌టచ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. కావాలంటే ఆపిల్ ఆప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Wednesday, August 13, 2014

వాట్సప్ పై టెలికం కంపెనీల గుర్రు!!

వాట్సప్, వైబర్, స్కైప్, వుయ్ చాట్.. ఇలా ఏదైతేనేం, లెక్కలేనన్ని యాప్ లు ఇప్పుడు వచ్చి పడ్డాయి. దాంతో టెలికం సర్వీస్ ప్రొవైడర్లకు పొట్ట కొట్టినట్లయింది. వీటిని విరివిగా ఉపయోగిస్తున్న వినియోగదారులు.. విడిగా ఎస్ఎంఎస్ పంపడం మానేశారు, కాల్స్ కూడా చాలావరకు తగ్గిపోయాయి. దాంతో ఇప్పుడు ఇటు ట్రాయ్ తో పాటు అటు సర్వీస్ ప్రొవైడర్లు కూడా కొత్త ఆలోచనలు చేస్తున్నారు. తాము నష్టపోతున్న ఆదాయాన్ని ఎలాగైనా తిరిగి ఇప్పించాలని కంపెనీలు ట్రాయ్ మీద ఒత్తిడి తెస్తున్నాయట.

అయితే, వాస్తవానికి మెసెంజర్ యాప్స్ వల్ల ఎస్ఎంఎస్ లు పూర్తిగా ఆగిపోలేదు. ఇంతకుముందు ఒక్క ఎస్ఎంఎస్ పంపేవాళ్లు ఇప్పుడు వాట్సప్ లాంటివాటి ద్వారా ఎక్కువ సేపు చాటింగ్ చేసుకుంటున్నారు. అలాంటప్పుడు కంపెనీలు అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అయినా, టెలికం కంపెనీలు ఒత్తిడి చేయడం, దానికి ట్రాయ్ కూడా తందానా అనడం వల్ల వినియోగదారులపై లేనిపోని భారం పడే ప్రమాదం ఉంది. అంతేకాదు, విస్తృతంగా వాడకంలో ఉన్న వాట్సప్ లాంటి యాప్ లను నియంత్రించాలని అనుకోవడం మీద కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

వాస్తవానికి ఎప్పటికప్పుడు మనిషి కొత్త టెక్నాలజీకి అలవాటు పడాలనుకుంటాడే తప్ప ఎంతసేపూ పాత చింతకాయ పచ్చడిలాగే ఉండిపోవాలని అనుకోడు. ఒకప్పుడు ఫోన్లంటే కేవలం మాట్లాడుకోడానికి, ఎస్ఎంఎస్ లకే ఉపయోగపడేవి. ఇప్పుడు ఫోన్లు కాస్తా మినీ కంప్యూటర్లు అయిపోయాయి. ఇలాంటి టెక్ యుగంలో కూడా సెల్యులార్ ఆపరేటర్లు వినియోగదారులను తమ గుప్పెట్లో పెట్టుకోవాలని అనుకోవడం మూర్ఖత్వమేనని పలువురు స్మార్ట్ ఫోన్ వాడకందారులు అంటున్నారు.

ఫేస్ బుక్ ను వైరస్ వెంటాడుతోంది..జాగ్రత్త!

సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ లో వాడుతున్నారా? అయితే మీ ఫేస్ బుక్ ప్రొఫైల్ ను కొత్త కలర్ స్కీమ్ తో మార్చుకోమని ఏమైనా అలర్ట్ వచ్చిందా? అయితే ఖచ్చితంగా ఆ అలర్ట్ వైరస్ అని తెలుసుకోవాల్సిందే. కలర్ చేంజ్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా 10 వేల మంది ఫేస్ బుక్ వాడకందారుల్ని ఇబ్బందికి గురిచేసేందని ఫేస్ బుక్ వర్గాలు వెల్లడించాయి. వైరస్ ను కట్టడి చేసేందుకు ఫేస్ బుక్ ప్రయత్నాలు విఫలయ్యాయి. వైరస్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 
 
మీకు ఫేస్ బుక్ కలర్ చేంజ్ మేసేజ్ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు: 
  • కలర్ చేంజ్ ట్యుటోరియల్ వీడియో చూడమని అడిగే మెసేజ్ లు యూజర్ల ఫేస్ బుక్ యాక్సెస్ టోకెన్స్ దొంగిలించే అవకాశం
  • ఫేస్ బుక్ అకౌంట్లను హ్యాకింగ్ చేసే ప్రమాదం. 
  • అసభ్యంగా ఉండే వీడియోలు ప్లే చేసే అవకాశం
  • యూజర్ ఆండ్రాయిడ్ మోబైల్స్ ను వాడుతుంటే.. యాప్ కరప్ట్ అయింది. కొత్త యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండి అనే మేసేజ్ వస్తుంది
  • ఒకవేళ మీరు అలాంటి యాప్ ను ఇదివరకే డౌన్ లోడ్ చేసుకుంటే వెంటనే యాప్ ను డిలీట్ చేయండి లేదా ఫేస్ బుక్ పాస్ వర్డ్ మార్చుకోవాలి.

మీ ఆత్మీయులతో సంభాషించే Skype calls record చేయాలనుకుంటున్నారా?

మీ ఆత్మీయులతో సంభాషించే Skype calls
record  చేసి ఉంచుకుంటే మనకు ఎప్పుడు కావాలి
అనుకుంటే చూస్కోవడానికి ఒక sweet memory గా
ఉంటుంది. దానికోసం ఈ చిన్న Technic  పాటించండి.

దీని కోసం మీరు చేయవల్సిందల్లా Video Call Recorder for Skype అనే application మీ system లో
install చేస్కంటే సరిపోతుంది.  ఇందులో ఉండే features ని ఒకసారి పరిశీలిస్తే దీనిని ఉపయోగించే విధానం
చాలా సులభం.ఎపుడు కావాలి అంటే అపుడు start/stop చేస్కోవచ్చు. అలాగే ఇందులో  ఒకరి వైపు
record   చేయాలా లేదా రెండు వైపులా record చేయాలా లేదా కేవలం audio మాత్రమే record చేయాలా
అని కూడా మనం ఎంచుకోవచ్చు.
 

టాప్ 5 బెస్ట్ 3డి రేసింగ్ గేమ్ లు

గేంస్ పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళకి ఈ 3 డి రేసింగ్ గేంస్ ని కూడా ఒకసారి ట్రై చేయవచ్చు .వీటిని ఆండ్రాయిడ్‌ లేదా ట్యాబ్లెట్ పిసి లలో ట్ర్రై చేయవచ్చు . వీటిని ఓ సారి ఆడితే వదలబుద్ది
కానంత ఆసక్తిగా ఉంటాయి .

1. FAST AND FURIOUS 6

Picture

ఆండ్రాయిడ్ మొబైల్ నుంచి ఆండ్రాయిడ్ మొబైల్ / లాప్ టాప్ కి వైర్లెస్ గా అధిక వేగం తో ఫైల్స్ ని ట్రాన్స్ఫర్ చేయడం ఎలా?

సాధారణం గా android mobile నుంచి Android mobile/
laptop కి files ని transfer చేయాలంటే మనం Bluetooth
వాడుతాం. ఇందులో files transferring slow గా ఉండటమే
కాకుండా కొన్ని devices లో Bluetooth లేకపోవచ్చు. ఈ
పోస్ట్ లో మనం ఎంత large file అయినా కొద్ది seconds
వ్యవధిలో అతి సులభం గా wireless గా files ని మీ android
mobile/tablet నుంచి laptop/android mobile/tablet
కి files ని ఎలా transfer చేస్కోవచ్చో చూద్దాం.
దీనికోసం మీ android mobile లో " Xender " అనే Application play store నుంచి మీ mobile
 లో install చేస్కోవాలి. సాధారణం గా మనం వాడే బ్లూటూత్ చాలా తక్కువ వేగం తో file transfer అవుతుంది . కాని ఇది wifi ఉపయోగించుకోవడం వల్ల ఎక్కువ వేగం తో file transfer అవుతుంది.
ఎంత పెద్ద  file అయినా క్షణాల్లో transfer అవుతుంది.

Thursday, August 7, 2014

విండోస్ స్మార్ట్‌వాచ్ ఇలా ఉంటుందా?


విండోస్ స్మార్ట్‌వాచ్ ఇలా ఉంటుందా?!
‘విండోస్’ ను వేరబుల్ గాడ్జెట్స్‌కు కూడా అందుబాటులో ఉంచుతామని మైక్రోసాఫ్ట్ ప్రకటించిన నేపథ్యంలో ‘మైక్రోసాఫ్ట్ స్మార్ట్‌వాచ్’ కచ్చితంగా వస్తుందని టెక్ పండితులు అంచనా వేస్తున్నారు. మైక్రోసాప్ట్ సొంతంగా స్మార్ట్‌వాచ్‌ను తయారు చేయకపోయినా... విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఆధారపడి పనిచేసే స్మార్ట్‌వాచ్ అందుబాటులోకి రావడం మాత్రం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఈ విండోస్ స్మార్ట్‌వాచ్ ఎలా ఉంటుంది? ఎలాంటి ఫీచర్లు ఉండబోతున్నాయి.. అనే విషయం గురించి ఆన్‌లైన్‌లో గాసిప్స్ మొదలయ్యాయి. ప్రస్తుతం ప్రపంచం స్మార్ట్‌వాచ్‌ల కోసం ఎదురుచూస్తున్న పరిణామాల మధ్య విండోస్ స్మార్ట్‌వాచ్ కాన్సెప్ట్ ఒకటి సచిత్రరూపంలో ఆసక్తికరంగా మారింది. నెటిజన్లను అమితంగా ఆకట్టుకొంటున్న విండోస్‌స్మార్ట్‌వాచ్ కాన్సెప్ట్ ఇదే...

 వాచ్‌ఫేస్:
అన్నివాచ్‌లలాగానే టైమ్, తేదీ చూసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది.

 బ్యాక్‌గ్రౌండ్: సెల్‌ఫోన్‌లో వాల్‌పేపర్ మార్చుకొన్నట్టుగానే ఈ స్మార్ట్‌వాచ్‌లో కూడా బ్యాక్‌గ్రౌండ్‌మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.

 ఆజ్ఞలు పాటిస్తుంది: ఈ స్మార్ట్‌వాచ్ పిలిస్తే పలుకుతుంది. ఒక ‘హాట్‌వర్డ్’ ను సెట్ చేసుకొంటే అది వినిపించినప్పుడల్లా స్పందిస్తుంది. మీ ఆజ్ఞలను పాటిస్తుంది.

 స్పర్శతెర: స్పర్శకు కూడా స్పందిస్తుంది. స్వైపింగ్ ద్వారా తెరలను మార్చుకోవచ్చు.

 నోటిఫికేషన్‌లు పంపిస్తుంది:
కీలకమైన విషయం ఏమిటంటే.. ఇది స్మార్ట్‌ఫోన్‌కు రిమోట్‌లా ఉంటుంది. మొబైల్‌తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. దానికి వచ్చే మెసేజ్‌ల గురించి అప్‌డేట్స్ ఇస్తుంది. జేబులోంచి ఫోన్ తీయకుండానే చేతికి కట్టిన ఈ స్మార్ట్‌వాచ్ ద్వారా ఫోన్‌ను ఆపరేట్ చేయవచ్చు.

 మెసేజ్‌లు చదువుకోవచ్చు: ఈ స్మార్ట్‌ఫోన్ తెరపై ఫోన్‌కు వచ్చిన టెక్ట్స్ మెసేజ్‌లు డిస్‌ప్లే అవుతాయి.

 టెక్ట్స్‌ను స్పీచ్‌గా మారుస్తుంది: మెసేజ్‌ను చదివి వినిపిస్తుంది.

 వాతావరణ వివరాలు, న్యావిగేషన్, మ్యూజిక్ ప్లేయర్‌లా ఉపయోగపడుతుంది.