లూమియా సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో ఆవిష్కరించి తనకంటూ
ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నోకియా, ‘లూమియా 530' పేరుతో మరో
బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర
రూ.7,349. గురువారం నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు
లూమియా సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో లూమియా 520 (రూ.8,000) తక్కువ ధర ఫోన్
కాగా, తాజాగా లూమియా 530 (రూ.7,349) ఆ స్థానాన్ని భర్తీ చేసిందని
మైక్రోసాఫ్ట్ మొబైల్స్ అనుబంధ నోకియా ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ విరాల్
ఓజా తెలిపారు. నోకియా లూమియా 530 కీలక ఫీచర్లు....
- డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ,
- 4 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480 పిక్సల్స్),
- విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం,
- 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్,
- అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
- 512 ఎంబి ర్యామ్,
- 4జీబి ఇంటర్నల్ మెమరీ,
- మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
- కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్),
- 1430 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

No comments:
Post a Comment
ఈ బ్లాగ్ లో ఉన్న కంటెంట్ పై ఎవరికైనా ఏమైనా అభ్యంతరం ఉంటే తెలియజేయండి, వాటిని తొలగించబడును.