Wednesday, July 30, 2014

హైదరాబాద్.. ఇంటింటా ఇంటర్‌నెట్

ఇక హై(వై)ఫై
► తొలి విడతగా వైఫై వచ్చే ప్రాంతాలు
►  హైటెక్ సిటీ 
►  మాదాపూర్ 
►  గచ్చిబౌలి
► వీటితో పాటు వెస్ట్ జోన్‌లోని కొన్ని ప్రాంతాలు
► మెట్రోపోలీస్ సదస్సుకు హాజరయ్యే విదేశీ ప్రతినిధులు విడిది చేసే హోటళ్లు, పర్యాటక ప్రాంతాలు


 వైఫై పనితీరు ఇలా..
 ‘వెర్లైస్ ఫెడిలిటీ’(వైఫై)... ఇప్పటివరకు లగ్జరీ హోటళ్లు, కార్పొరేట్ ఆఫీసులు, షాపింగ్ మాళ్లకే పరిమితమైన వైఫై సేవలు.. త్వరలో నగరం నడిబొడ్డున పొందొచ్చు. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఉంటే చాలు.. వైర్లతో పనిలేకుండా ఆన్‌లైన్‌లో ఉచితంగా విహరించొచ్చు. సెప్టెంబర్ కల్లా హైదరాబాద్‌లో వైఫై సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో వైఫై కథాకమామిషేంటో  ఓ లుక్కేద్దాం రండి!

 ఇప్పటికే ప్రపంచదేశాల్లో గుర్తింపు పొందిన భాగ్యనగరం మరో మైలురాయిని దాటనుంది. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌ను కూడా వైఫై ఆధారిత నగరంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. దేశవ్యాప్తంగా 4జీ సేవల లెసైన్స్ పొందిన రిలయెన్స్ సంస్థ చేతికి పగ్గాలప్పగించింది. తొలి విడతలో.. హైదరాబాద్‌తో పాటు 6 కార్పొరేషన్లు, 37 మున్సిపాలిటీల్లో, రెండో విడతలో.. ఇతర పట్టణాలు, 220 మండల కేంద్రాల్లో, మూడో విడతలో రాష్ట్రమంతటా 4జీ సేవలు అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

 వై -ఫై అంటే..
 వైఫై అంటే.. వైర్‌లెస్ లోకల్ ఏరియా నెట్‌వర్క్ (డబ్ల్యూఎల్‌ఏఎన్). ఇది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ (ఐఈఈఈ) 802.11 స్టాండర్స్‌పై ఆధారపడి ఉంటుంది. వైఫై అంటే ైవెర్లైస్ ఫెడిలిటీ అన్నమాట. ఒక్క వైఫై టవర్ సిగ్నల్స్ ఇండోర్‌లో అయితే 20 మీటర్లు, ఔట్‌డోర్‌లో అయితే 100 మీటర్లు వరకు అందుతాయి. వైఫై సేవలను పొందాలంటే ఫోర్త్ జనరేషన్ (4జీ) ఉండాల్సిందే.

 సిగ్నల్స్ ఇలా..
 తీగల అవసరం లేకుండా నిర్ణీత పరిధిలో హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందడమే వైఫై. బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ తీసుకున్న తర్వాత వైఫై రౌటర్ పరికరాన్ని అమర్చుతారు. ఈ పరికరం బ్రాడ్ బ్యాండ్ ద్వారా అందే ఇంటర్నెట్‌ను నిర్ణీత పరిధిలో వైఫై ఉన్న ఫోన్లు, కంప్యూటర్ల వంటి వాటికి ఇంటర్నెట్ సిగ్నల్‌ను అందిస్తా యి. మనం బ్లూటూత్ ద్వారా ఫోటోలు, పాటలు పంపినట్లే వై-ఫై ఇంటర్నెట్ సేవలను అందిస్తుందన్నమాట.

తొలి 6 నెలలు ఉచితం.. ఆపై నెలకు రూ.1,200
 తొలి విడతగా వైఫై సేవలను సచివాలయం, అసెంబ్లీ, జీహెచ్‌ఎంసీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లోని కొన్ని ప్రాంతాలు, సైబరాబాద్ పరిధిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తదితర ప్రాంతాల్లో ఆరునెలల పాటు వైఫై ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మామూలుగా అయితే 4జీ కనెక్షన్‌కు చుట్టూ 4 కి.మీ. వరకు వైఫై అందుబాటులో ఉండే వీలున్నా.. పాస్‌వర్డ్ ఉన్నవారికి మాత్రమే అందుబాటులోకి వస్తుంది. అయితే ముందుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో అందరికీ ఉచితంగా వైఫై సేవల్ని అందిస్తారు. ఆ తర్వాత కనెక్షన్‌కు ప్రతినెలా రూ.1,200 వరకు చార్జీ వసూలు చేస్తారు.

ప్రయోజనాలనేకం..
 - ఇంటి పన్ను, విద్యుత్ బిల్లులు, లే-అవుట్ల అనుమతులు, జనన, మరణ ధృవీకరణ పత్రాల వంటి స్థానిక సర్టిఫికేట్లు వంటి సుమారు 15 రకాల ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్‌తో అనుసంధానం చేస్తారు. దీంతో వినియోగదారులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే ఉచితంగా పొందవచ్చు. దీంతో డబ్బుకు డబ్బు.. సమయానికి సమయం ఆదా అవుతుంది. ట్రాఫిక్ చిక్కులూ తప్పుతాయండోయ్.
- వైఫై సేవలతో ప్రపంచ దేశాల్లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న దానికంటే ఇంటర్నెట్, ఫోన్ల పనితీరు ఎన్నో రెట్లు మెరుగవుతుంది.
 - వైఫై సౌకర్యం ఉన్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్ ఉంటేచాలు.. మొబైల్ డేటా నెట్‌వర్క్ లేకున్నా, వైఫై కనెక్టివిటీ ద్వారా ఇంటర్నెట్‌ను బ్రౌజింగ్ చేసే వీలుంటుంది. గల్లీ గల్లీల్లో నిలబడి కూడా ఈ-మెయిల్స్, ఫేస్‌బుక్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్‌ల్లో సర్ఫింగ్ చేయొచ్చు.
 - 4జీతో కేబుల్ కనెక్షన్లతో అవసరముండదు. ఆన్‌లైన్ ద్వారా ఒకే టీవీలో అన్ని చానళ్లు వీక్షించే వీలుంటుంది.
 - మొబైల్ ఫోన్‌లో మనం మాట్లాడే వ్యక్తులను చూసే వీలుంటుంది. దీనివల్ల ఒకరికొకరు దగ్గరగా ఉండి మాట్లాడుతున్నామనే అనుభూతి కలుగుతుంది.

 యూజర్ నేమ్, పాస్‌వర్డ్ తప్పనిసరి..
 వైఫై సేవలకు యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఉండాల్సిందే. ముందుగా వినియోగదారులు మొబైల్  నంబరు, ఈ-మెయిల్ ఐడీ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలు నమో దుచేసిన వెంటనే మొబైల్‌కు ఓటీపీ (వన్‌టైమ్ పాస్‌వర్డ్) వస్తుంది. ఈ పాస్‌వర్డ్‌ను ఉపయోగించి లాగిన్ కావచ్చు.

 ఇప్పటికే 500 కి.మీ. పూర్తి..
నగరంలో పూర్తి స్థాయి వైఫై సేవలకు 1,700 కి.మీ. మేర ఆప్లిక్ ఫైబర్ కేబుల్(ఓఎఫ్‌సీ) లైన్లు అవసరముంటుందని నిపుణు ల అంచనా. ఇప్పటికే రిలయెన్స్ 500 కి.మీ. మేర లైన్ల నిర్మాణం పూర్తి చేసింది. అయితే అక్టోబర్‌లో నగరంలో జరగనున్న మెట్రోపోలీస్ సదస్సు నాటికి కొన్ని ప్రాంతాల్లోనైనా వైఫై సేవలను ప్రారంభించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.

 రోజుకు 3 గంటలు.. 50 ఎంబీ డేటా..
 రోజుకు 3 గంటల చొప్పున 50 ఎంబీ డేటా వరకు ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చు. కచ్చితమైన డేటాలోని ఐఎంఈఐ నంబర్లున్న మొబైల్, ట్యాబ్, ల్యాప్‌టాప్‌లకు మాత్రమే వైఫై సేవలు పొందే వీలుంటుంది. ఒక రోజులో 3 గంటల సమయం దాటితే వైఫై కనెక్టివిటీ ఉండదు.

 దృష్టి పెట్టాల్సిందిక్కడే: టీ ఐటీ ఎంప్లాయిస్ జేఏసీసీ లక్ష్మారెడ్డి

-  ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అమలవుతున్న వైఫై విధి, విధానాలు, లోటు పాట్లను క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేయాలి. ఇందుకోసం ప్రత్యేకమైన సాంకేతిక నిపుణుల్ని నియమించాలి.
 - వైఫై కింద ప్రభుత్వ సేవలను ఉచితంగా అందించి, ప్రైవేటు సేవలను కొంత మొత్తంతో అందించాలి. దీంతో నగదు భారం కాసింత తగ్గుతుంది.
 - వైఫై ఉపయోగించుకునే వ్యక్తి ఎలాంటి మొబైల్, ల్యాప్‌టాప్ వాడుతున్నాడు, ఇంటర్నెట్‌లో ఏం చెక్ చేస్తున్నాడు, ఏం డౌన్‌లోడ్ చేస్తున్నాడు.. వంటి అనేక అంశాలపై సర్వీసు ప్రొవైడర్లు ఎప్పటిక ప్పుడు నిఘా వేయాలి.
 - సంఘ విద్రోహక శక్తుల చేతుల్లోకి వైఫై కనెక్టివిటీ వెళ్లకుండా సైబర్ క్రైమ్ టీంను బలోపేతం చేయాలి. నేరస్థులను కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలి.
 - కేవలం సమాచారాన్ని తెలుసుకునేందుకు, బ్రౌజింగ్, ఈ-మెయిల్స్ పంపించేందుకు మాత్రమే వైఫైని ఉచితంగా అందించాలి. వీడియో, ఆడియో స్ట్రీమింగ్, డౌన్‌లోడ్‌లను నియంత్రించాలి.
 - ఒకే సర్వర్‌పై ఎక్కువ గంటలు బ్రౌజింగ్ చేస్తే అక్కడి ఇంటర్నెట్ స్పీడ్ తగ్గడంతో పాటు, సర్వర్ కుప్పకూలే ప్రమాదముంది. పైగా స్థానిక వ్యాపారులు అపరిమితంగా వాడుకుని దుర్వినియోగం చేసే అవకాశముంది. ఈ అంశంపై దృష్టి సారించాలి.

ఫోన్ తలగడ కింద పెట్టుకుంటే అంతే!

మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా. అయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పడుకునే ముందు స్మార్ట్ ఫోన్ కొంచెం దూరంగా పెట్టే పడుకుంటే మంచిది. ఇక చార్జింగ్ పెట్టినయితే తీసేయడం మర్చిపోవద్దు. తన స్మార్ట్ ఫోన్ కు చార్జింగ్ పెట్టి నిద్రపోయిన ఓ అమెరికా బాలిక తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఉత్తర టెక్సాస్ లో ఈ ఘటన గురించి స్థానిక మీడియా వెల్లడించింది.

13 ఏళ్ల బాలిక తన సామ్ సంగ్ గెలాక్సీ ఎస్4 ఫోన్ కు చార్జింగ్ పెట్టి తలకింద పెట్టుకుని నిద్రపోయింది. చాలాసేపటి తర్వాత కాలిన వాసన రావడంతో ఆ బాలిక మేల్కోంది. అప్పటికే తలగడకు కొద్దిగా మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన బాలిక అక్కడి నుంచి దూరంగా జరిగింది. ఎక్కువగా చార్జింగ్ పెట్టడం బ్యాటరీ వేడెక్కి మంటలంటుకుని ఉండొచ్చని బాలిక తండ్రి తెలిపారు. అయితే ఫోన్ తలగడ కింద పెట్టుకోవద్దని సామ్ సంగ్ కోరింది.

సెల్ దొంగల్ని పట్టిచ్చే యాప్

దొంగను పట్టిచ్చే యాప్ లు వచ్చేశాయి. లుక్ అవుట్ అనే యాప్ సెల్ ఫోన్ దొంగతనం చేసే వాళ్ల ఫోటోలను, దొంగతనం చేసిన ప్రదేశాన్ని ఫోటో తీసి, యజమానికి ఈ మెయిల్ చేసేస్తుంది. గంటల్లో  దొంగను పట్టేయచ్చు.
ఈ లుక్ అవుట్ అనే యాప్ తాజాగా అమెరికాలోని ఫ్లోరిడా లో ఒక మహిళా దొంగను పట్టేసింది. దొంగ ఓ కారు నుంచి సెల్ ఫోన్ ను తీసుకుంది. కారు యజమాని విండో మూయడం మరిచిపోవడంతో దొంగ పని సులువయింది. అయితే దొంగ ఫోన్ ను అన్ లాక్ చేయడానికి ప్రయత్నించగానే ఆ యాప్ అలర్ట్ అయిపోయింది. ఆమె ఫోటో తీసేసింది. ఆ తరువాత దొంగతనం చేసిన ప్రదేశం తాలూకు ఫోటోలు తీసింది. ఆ ఏరియా మ్యాప్ ను డౌన్ లోడ్ చేసేసింది. ఇవన్నీ యజమానికి ఈ మెయిల్ రూపంలో వచ్చేశాయి. 
ఆ యజమాని సోషల్ మీడియాలో దొంగ ఫోటో, దొంగిలించిన ప్రదేశం తాలూకు ఫోటోలను అప్ లోడ్ చేసింది. గంటల్లో ఆ వివరాలు వేలాది మంది షేర్ చేశారు. దాంతో దొంగను గుర్తించి పట్టేసుకున్నారు. 
ఫోన్ మరిచిపోయే వాళ్లకు ఈ యాప్ ఎంతో ఉపయోగం. కానీ సెల్ దొంగలకు ఈ యాప్ అంటే బాప్ రే బాప్!!

ఫేస్‌బుక్‌ యూజర్లకు సరికొత్త ఆప్షన్!

నెటిజన్లకు మరింత చేరువయ్యేందుకు సరికొత్త ఆప్షన్ ప్రవేశపెట్టింది ఫేస్ బుక్. ఇప్పటివరకూ మొబైల్ లో ఫేస్ బుక్ ను ఉపయోగించినా.. అందులో కావాల్సిన వాటిని సేవ్ చేసుకోలేదన్న చింతను తొలగించేందుకే ఈ సరికొత్త ఆప్షన్. మీరు ఆండ్రాయిడ్ లో లేదా ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్లలో ఫేస్‌బుక్‌ ను ఉపయోగిస్తుంటే  ఇక నుంచి ‘సేవ్’ అనే కొత్త ఆప్షన్ దర్శనమివ్వనుంది. సినిమాలు, పాటలు, టీవీ షోల వంటి వాటిని వీలు కుదిరినప్పుడు చూసుకునేందుకు వీలుగా వాటి లింకుల్ని ఈ ఆప్షన్ ద్వారా సేవ్ చేసుకోవచ్చు. మీరు సేవ్ జాబితాలో చేర్చుకునే లింకులు ఇతరులెవరికీ కనిపించవు కూడా.

అవసరమనుకుంటే వాటిని ఆర్చీవ్ లో భద్రపర్చుకోవచ్చు. లేదా ఇతరులతో షేర్ చేసుకోవచ్చు.ఈ ఆప్షన్ ను అతి త్వరలోనే అందుబాటులోకి తెస్తున్నట్లు ఫేస్ బుక్ స్పష్టం చేసింది. యూజర్లు సేవ్ చేసుకున్న లింక్స్ ను ఏ సమయంలోనైనా తిరిగి చూసుకోవాలంటే ఎడమవైపున ఉన్న ట్యాబ్ ను క్లిక్ చేస్తే సరిపోతుందని తెలిపింది.

Saturday, July 26, 2014

LAPTOP BATTERY గురించిన కొన్ని నిజాలు

కొన్ని కంపెనీలకు వినియోగాదారుడుకి అతి ఉత్తమమైన ఉత్పత్తి అందించడమే లక్ష్యం . అయితే చాలా వాటికి మాత్రం  వినియోగాదారుడుకి ఒక్క సారి తమ PRODUCT ని విక్రయించాక తిరిగి ఏదో విధంగా తమ పైన ఆధారపడేలా చేయడం వారి లక్ష్యం . 
కంప్యూటర్ తయారిదారుల్లో ఈ రెండో కోవకి చెందిన వారు ఎక్కువగా ఉంటారు . 
ఉదాహరణ :-  కొన్ని రకాల విజయవంతమైన MOBILE PHONE మోడళ్లను COMPANIES ఉన్నట్టుండి తయారు చెయ్యడం ఆపేస్తాయి . దీనికి కారణం అవి ఎక్కువకాలం మన్నటం వల్ల CUSTOMERS తమ MOBILE ను మార్చుకోవాలనే ఆలోచనను పక్కన పెడతారు . దాంతో ఆ COMPNIES యొక్క కొత్త MODELS కు అంతగా విక్రయాలు ఉండవని వారి భయం . అందుకే చాలా COMPANIES మంచి మంచి MOBILE PHONE MODELS ను తయారు చెయ్యడం ఆపేస్తాయి. అయినా వాటికి DEMAND తగ్గక పోతే వాటి SUPPORTING SOFTWARES ని ఇవ్వకపోవడం , SPARE PARTS తయారు చెయ్యకపోవడం వంటి పనుల ద్వారా వాటి వినియోగాన్ని తగ్గిస్తారు .
చాలా మంది కంప్యూటర్ తయారి దారులు ఒక మోడల్ LAPTOP RELEASE చేసిన కొన్ని రోజులకి వేరొక  మోడల్ RELEASE చేస్తారు . నిజంగా అందులో పాత మోడల్ కన్నా మంచి FEATURES ఉంటె మంచిదే . కానీ వాటిల్లో చాలా వరకూ చిన్న చిన్న UPGRADATIONS మాత్రమే ఉంటాయి కానీ ఈ కొత్త మోడల్ గనక కొనక పోతే ప్రపంచం వెనక్కి వెళ్ళిపోతుంది అన్నంతగా ప్రచారం చేస్తారు . దీనికి కారణం 
1. మిగతా కంపెనీలతో పోటీలో వెనకబడి పోతామేమో అన్న భయం 
2. CUSTOMER వేరే COMPANIES MODEL వైపు మళ్ళిపోతాడేమో అన్న భయం 
3. CUSTOMER దగ్గర నుంచి అతి ఎక్కువ డబ్బులు రాబట్టాలనే ఆశ .
 ఒక సారి ఒక LAPTOP కొన్న CUSTOMER కి మళ్ళీ అంత తొందరగా వేరొక మోడల్ కొనాల్సిన అవసరం రాకపోవచ్చు  కానీ SPARE PARTS అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది . ఈ సూత్రమే COMPANIES FOLLOW అవుతున్నాయి. అవి BIKES అయినా , కార్ అయినా , కంప్యూటర్  అయినా వేరే ఏ ఇతర పరికరం లేదా సేవ అయినా ఇదే సూత్రం. 
ఈ పై ఉదాహరణ ఇవ్వడానికి గల కారణం  LAPTOP BATTERY. మీ LAPTOP లో అతి ముఖ్యమైన భాగం BATTERY. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే , LAPTOP WARRANTY వేరు , BATTERY WARRANTY వేరు . అయితే BATTERY కి WARRANTY ఉండదు లేదా LAPTOP కి ఇచ్చిన WARRANTY కన్నా చాలా తక్కువ కాలం ఉంటుంది .
ఇక రెండో విషయం . మీ LAPTOP BATTERY లోపల ఒక charge CYCLE  COUNTING  CHIP ఉంటుంది . ఇది మీ BATTERY ఎన్ని సార్లు CHARGE అయ్యిందో , ఎన్ని సార్లు DISCHARGE అయ్యిందో లెక్క వేస్తూ ఉంటుంది . ప్రతి COMPANY తమ LAPTOP BATTERY ని కొన్ని నిర్దిష్టమైన సార్లు మాత్రమె ఛార్జ్ మరియు DISCHARGE చేసేలా ఒక prograame ని రూపొందించ  ఈ చిప్ లో భద్రపరుస్తాయి . అన్ని సార్లకి మించి మీరు CHARGE చెయ్యలేరు ఎందుకంటే ఆ చిప్ CHARGING ని అడ్డుకుంటుంది . దాంతో మీరు BATTERY ని మార్చక తప్పని పరిస్తితి ఏర్పడుతుంది . 
అసలు ఈ CHARGE  CYCLES అంటే ఏంటో చూద్దాం 
ఒక CHARGE మరియు ఒక DISCHARGE కలిపి ఒక CYCLE . అంటే మీరు మీ LAPTOP ని ఒక సారి CHARGING పెట్టి ఆ తర్వాత వాడితే (AC ADAPTER లేకుండా ) అది ఒక CYCLE . దీని మీద భిన్నాభిప్రాయాలున్నాయి . ఎందుకంటే ఒక్కో COMPANY ఒక్కోలా CYCLES ని లేక్కేస్తుంది .
APPLE COMPANY  ప్రకారం 
BATTERY ని ఒక సారి పూర్తిగా (100%) ఛార్జ్ చేసి 
పూర్తిగా DISCHARGE (100%) చేస్తే ఒక CYCLE అని చెప్తుంది.
ఉదాహరణ :- . మీ BATTERY ని  100%ఛార్జ్ చేసి ,  కొంత సేపు వాడారు అనుకుందాం . అప్పుడు అది 25% discharge అయ్యింది. మళ్ళీ రెండవ రోజు ఇంకో 50% వాడారు . అంటే ఇప్పటికి 75% పూర్తయ్యింది . తర్వాత రోజు మిగతా 25% వాడారు . అంటే పూర్తిగా DISCHARGE చేసారు కాబట్టి ఒక CYCLE పూర్తయ్యింది.
ఇంకో లెక్క ప్రకారం 
ఒక సారి 50% కంటే ఎక్కువ ఛార్జ్ చేసిన తర్వాత, BATTERY తో LAPTOP వాడుతున్నప్పుడు  50%  కంటే తక్కువకి CHARGING రాగానే  ఒక CYCLE పూర్తవుతుంది.
కానీ ఏది  పూర్తిగా నిజమో కాదో ఎవ్వరికీ తెలియదు . ఎందుకంటే ఎన్ని సార్లు ఛార్జ్ చేసాం , ఎన్ని సార్లు DISCHARGE చేసాం అన్నది లెక్కపెట్టడం మన వల్ల అయ్యే పని కాదు  దాంతో ఈ CYCLE లేక్కలనేవి ఒక రహస్యంగానే ఉండిపోయాయి.

మొత్తం మీద మనం అర్ధం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే BATTERY లోని చిప్ ప్రతి CHARGE ని DISCHARGE ని లేక్కేస్తుంది . ఇక్కడ నవ్వుతో కూడిన ఏడుపు తెప్పించే విషయం ఏమిటంటే , మీ LAPTOP BATTERY CONDITION ఎలా ఉన్నా (ఒక వేళ చక్కగానే ఉన్నా ) CHIP లో ఇన్ని CYCLESకు మించి BATTERY ని వాడకూడదు అని PROGRAMME ఉంది కాబట్టి మన BATTERY పాడై పోయినట్లే  లెక్క. అంతకు మించి ఉపయోగిద్దామని మీరు ప్రయత్నం చేసినా మీ BATTERY ఛార్జ్ అవ్వదు . అంటే మీ BATTERY భవిష్యత్తుని నిర్ణయించేది దాని పనితనం కాదు . చిప్!. 
COMPANIES చెప్పేదేంటంటే అన్ని CYCLES మించిన తర్వాత ఆ BATTERY జీవిత కాలం తగ్గిపోయినట్లే అని . ఒక వేళ అది నిజమే అయితే , CHIP అవసరం దేనికి ? BATTERY తనంతట తానుగానే CHARGING తీసుకోదు కదా!  ఒక CHIP ని ఉపయోగించి CHARGING ని BLOCK చెయ్యడం ఎందుకు? కాబట్టి ఇందులో ఖచ్చితంగా ఏదో దురుద్దేశం దాగి ఉందని COMPUTER నిపుణుల అభిప్రాయం . అదే నా అభిప్రాయం కూడా . 
కాబట్టి మీ BATTERY జీవిత కాలం పెరగటానికి ఉత్తమమైన మార్గం ఏమిటంటే 
1.మీరు SWITCH  BOARD కి దగ్గరగా ఉన్నట్లయితే LAPTOP ని AC ADAPTER తోనే వాడండి . దీని వల్ల మీ BATTERY OVER CHARGE అవ్వదు ఎందుకంటే అది 100% FULL అవ్వగానే దానికి POWER CUT -OFF అయ్యి CHARGING ఆగిపోతుంది మరియు AC ADAPTER మీదనే LAPTOP పని చేస్తుంది . కానీ వారానికి ఒక్క సారైనా BATTERY ని పూర్తిగా వాడేయండి .  (100% DISCHARGE ).
2. ఒక వేళ మీకు BACK -UP POWER SOURCE అంటే UPS లేదా INVERTER వంటివి ఉన్నట్లయితే , BATTERY ని LAPTOP లో నించి తొలగించి AC ADAPTER తో మాత్రమె వాడండి . కానీ వారానికి ఒక్కసారి BATTERY ని పూర్తిగా discharge చెయ్యడం మర్చిపోకండి .
BATTERY ని అప్పుడప్పుడైనా పూర్తిగా DISCHARGE చెయ్యకుండా, AC ADAPTER మీదే వాడితే  battery జీవిత కాలం దెబ్బ తింటుంది . అందుకే అప్పుడప్పుడు దాన్ని పూర్తిగా discharge చేస్తూ ఉండాలి .

ఫోనిటిక్ కీ బోర్డ్ ఆధారంగా ఎటువంటి భారతీయ ప్రాంతీయ భాషైననూ టైప్ చేయుట

కంప్యూటర్ లో భారతీయ భాషలను ఉపfయోగించుట సాధారణ వ్యక్తికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. భారతీయ భాషలలో క్విల్ పేడ్ మరియు లిపికార్ ఉచితంగా ఆన్ లైన్లో టైపు చేసే ఉపకరణములు. ముందుగా విశ్లేషించబడిన నియమకాల ప్రకారం లిప్యంతీకరణ సాంకేతికాలకు ఆధారంగా ఉంటుంది. లిప్యంతీకరణ సాంకేతిక విద్య టైపు చేసే వారికి, వారు సాధారణంగా ఎలా చేస్తారో అలా చేయనిస్తుంది. (rAshTrbhAshA కాకుండా rashtra bhasha లాగా ) నిర్దుష్టమైన కేస్-సెన్సిటివ్ టైపింగ్ నియమాలలాగా లిప్యంతీకరణ ఉపకరణములు, ఆంగ్ల పదములు ఫొనిటికల్ గా టైపు చేయుటను ఆశిస్తుంది. దీనివల్ల టైపు చేయువారు వారి ఎన్నిక ప్రకారం వారి సొంత ప్రాంతీయ భాషలో సమాచారం పంపవచ్చును. పేజీ లోకి వెళ్ళగానే ప్రాంతీయ భాషతో టైపు చేయడానికి మీకు కావలసిన భాషను ఎన్నుకోవచ్చు. ఇటువంటి సౌలభ్యం కల్పించే వెబ్ సైట్ లు చాలా ఉన్నాయి.
http://www.google.com/transliterate
http://quillpad.com/
http://www.lipikaar.com/

తెలుగు ఫాంట్లను డౌనులోడ్ చేసుకోండి

భారతీయ భాషల యొక్క సాంకేతిక అభివృద్ధి (టి డి ఐ ఎల్ ) కార్యక్రమం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగము (డి ఐ టి) మొదలు పెట్టింది. భారత ప్రభుత్వం భారతీయ భాషలలో మానవ యాంత్రిక పరస్పర సంబంధము కలుగ జేయుటకు సమాచార గమన ఉపకరణలను అభివృద్ధిచేయాలన్న ఆశయం కలిగిఉంది మరియు పలుభాషా జ్ఞాన వనరులను అందుబాటులోకి తెచ్చుటకు సాంకేతిక విద్యలను అభివృధ్ధి పరచాలని ఉంది. సామాన్య ప్రజల లబ్ధి కొరకు వెబ్ డౌన్ లోడ్ ల ద్వారా మరియు భాషా సిడిల ద్వారా ఫాంట్ లు అనేవి ప్రజలకు చాలా సులువుగా అందబడుచున్నవి. ఫాంట్లను డౌన్ లోడ్ కొరకు ఎంచుకున్న భాష మీద క్లిక్ చేయండి.
http://www.ildc.in/

ఆన్ లైన్ నిఘంటువులు

హిందీ నిఘంటువు

ఆంగ్లము నుండి హిందీ నిఘంటువు మరియు హిందీ నుండి ఆంగ్ల నిఘంటువు. ఆంగ్ల పదముల కొరకు వెదకవచ్చును లేక బిల్ట్ఇన్ కీ బోర్డ్ సహాయంతో హిందీ పదములు వెదకవచ్చును.

తెలుగు నిఘంటువు


తమిళ నిఘంటువు


బెంగాలి నిఘంటువు


మరాఠి నిఘంటువు


ఆంగ్లము నుండి ఆంగ్లము

టచ్‌స్ర్కీన్‌ను క్లీన్ చేయటం ఏలా..?


టచ్‌స్ర్కీన్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్ పీసీలను ఉపయోగించే వారు తరచూ స్ర్కీన్ క్లినింగ్ విషయంలో అప్రమత్తత పాటించాల్సి ఉంటుంది. లేకుంటే టచ్‌స్ర్క్కీన్ మన్నికను కోల్పోయే ప్రమాదముంది. క్రింది స్లైడ్‌షోలో టచ్‌స్ర్కీన్‌ను క్లీనింగ్ విషయంలో పాటించాల్సిన అంశాలను ప్రస్తావించటం జరిగింది.

స్ర్కీన్‌ను శుభ్రం చేసేందుకు డిస్టిల్ వాటర్ లేదా వైట్ వెనిగార్‌ను ఉపయోగించండి. లేదా క్లీనింగ్ కిట్‌తో వచ్చిన సొల్యూషన్‌ను ఉపయోగించండి. స్ర్కీన్‌ను శుభ్రం చేసే క్రమంలో మైక్రో ఫైబర్ క్లాత్‌ను మాత్రమే వాడండి. మీ ఫోన్ టచ్‌స్ర్కీన్‌ను శుభ్రపరిచే క్రమంలో కఠినమైన రసాయనాలు ఇంకా ఆల్కాహాల్ ఆధారిత క్లీనర్లను ఉపయోగించొద్దు. స్ర్కీన్ క్లీనింగ్‌లో భాగంగా గరుకు బట్టలు, పేపర్ టవల్స్, టిష్యూ పేపర్స్ వంటి వాటిని ఉపయోగించకండి. వీటిని ఉపయోగించటం వల్ల స్ర్కీన్ పై గీతలు పడతాయి. స్ర్కీన్‌ను శుభ్రం చేసే క్రమంలో మీ చేతలతో స్ర్కీన్ పై బలంగా రాపిడి చేయవద్దు.

మీ స్మార్ట్‌ఫోన్‌ను యూనివర్సల్ రిమోట్ కంట్రోల్‌లా ఉపయోగించటం ఏలా..?


మీ స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్‌ను యూనివర్సల్ రిమోట్ కంట్రోల్‌లా ఉపయోగించుకునేందుకు అనేక అప్లికేషన్‌లతో పాటు అత్యాధునిక వ్యవస్థలు అందుబాటులోకి వచ్చేసాయి. వీటి సాయంతో మీ స్మార్ట్‌ఫోన్‌ను రిమోట్ కంట్రోల్‌లా మార్చేసి టీవీ, ఏసీ, కార్ ఇలా అనేక సాంకేతిక గృహోపకరణాలను నియంత్రించవచ్చు. గృహోపకరణాలను నియంత్రించేందుకు: గృహ యాంత్రికరణ విభాగంలో కీలక భూమిక పోషిస్తున్న ప్రముఖ బ్రాండ్ క్రిస్ట్రాన్ (Crestron) ఐఓఎస్ ఇంకా ఆండ్రాయిడ్ ఆధారిత డివైజ్‌లకు వివిధ అప్లికేషన్‌లను అందిస్తోంది. వై-ఫై ఆధారంగా క్రిస్ట్రాన్ వ్యవస్థ స్పందిస్తుంది. క్రిస్టాన్ అందిస్తున్న అప్లికేషన్‌లను ఉపయోగించుకుని లైటింగ్, ఎయిర్ కండీషనర్ వంటి గృహోపకరణాలను నియంత్రించవచ్చు. వైపర్ స్మార్ట్‌స్టార్ట్: వైపర్ స్మార్ట్‌స్టార్ట్ అప్లికేషన్ ద్వారా స్మార్ట్‌ఫోన్ సాయంతో కారును లాక్ లేదా అన్‌లాక్ చేయవచ్చు. ఈ అప్లికేషన్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఇంకా బ్లాక్‌బెర్రీ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ల కోసం అందుబాటులో ఉంది. అయితే ముందుగా వైపర్ సెక్యూరిటీ వ్యవస్థతో పాటు స్మార్ట్‌ఫోన్ మాడ్యూల్‌ను కార్‌లో ఇన్‌‍స్టాల్ చేయవల్సి ఉంది. పూర్తి వివరాలకు www.viper.comలోకి వెళ్లిండి. పీసీ ఇంకా మాక్ కొరకు రిమోట్ అప్లికేషన్స్: పీసీ ఇంకా మాక్‌లను స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా నియంత్రించేందుకు అనేకమైన అప్లికేషన్‌లు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. వీటి సాయంతో స్మార్ట్‌ఫోన్ ద్వారా మౌస్ పాయింటర్, ఇన్‌పుట్ టెక్స్ట్, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్ వంటి అంశాలను నియంత్రించుకోవచ్చు.

మీ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ చేయబడిందని గుర్తించటం ఏలా..?



మార్క్‌ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని సహచరగణంతో 2004లో ప్రారంభమైన ఈ సామాజిక సంబంధాల వారధి ప్రపంచవ్యాప్తంగా 125కోట్ల పై చిలుకు వినియోగదారులను కలిగి ఉంది. ఫేస్‌బుక్ వినియోగం రోజురోజుకు పెరుగుతున్న నేపధ్యంలో హ్యాకింగ్ ఘటనలు తరచూ నమోదవుతున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఫేస్‌బుక్ ఖాతాదారులు హ్యాకింగ్ బారిన పడినప్పుడు చేపట్టవల్సిన అత్యవసర చర్యలను సూచించటం జరుగుతోంది. మొదటి స్టెప్‌లో భాగంగా మీ ఫేస్‌బుక్ అకౌంట్ హోమ్ పేజీ పై కుడి వైపు‌న కనిపించే ‘గేర్ ఐకాన్' పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఓ డ్రాప్-డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. మెనూలోని సెట్టింగ్స్ ఆప్షన్‌లోకి వెళ్లండి. ADVERTISEMENT సెట్టింగ్స్ పేజీలోకి వెళ్లిన తరువాత ఆ పేజీలో ఎడమవైపు కనిపించే ‘సెక్యూరిటీ' ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఆ తరువాత సెక్యూరిటీ సెట్టింగ్స్‌లో కనిపించే *Active Sessions* వద్దకు వెళ్లండి. ఆ పక్కగా కనిపించే *Edit* పై క్లిక్ చేయండి. ఈ సెక్షన్‌లో మీ ఫేస్‌బుక్ అకౌంట్ లాగిన్‌కు సంబంధించి రికార్డులు ఉంటాయి. వాటిలో అనుమానస్పద లాగిన్ మీ కంటపడినట్లయితే సంబంధిత సెషన్ పైన కనిపించే *End All Activity* పై క్లిక్ చేయండి.