Saturday, July 26, 2014

DOWNLOADS / డౌన్లోడ్స్ చేసేటప్పుడు జాగ్రత్త

computer  వాడే వాళ్ళలో అనేకమంది చేసే పని download చెయ్యడం. అవి పాటలైనా కావచ్చు, సినిమాలైనా కావచ్చు, softwares కావచ్చు , లేక blue films కావచ్చు. ఏది ఏమైనా మన దగ్గర లేని దాన్ని ఉచితంగా పొందడానికి మనం computer ని ఆశ్రయిస్తాము. ఉచితం అనే దాన్ని ఎరగా వేసి ప్రజల్ని మోసం చెయ్యడం ఒక విజయవంతమైన విధానం. అందుకే ఎవరైనా ఏదైనా ఉచితం అనగానే మనకు అవసరం లేని వాటిని కూడా మనం ఇంటికి తెచ్చుకుంటాం.
                                 computer లో ఉంచే free downloads కూడా అలాంటివే. మనం పాటల్ని ఉచితంగా download చేసుకోవాలంటే వాటినన్నిటినీ ఒక server లో ఉంచాలి. అందుకై server కొనాలి, దానిని నిర్వహించడానికి ఒక భవనం కావాలి, ఉద్యోగులు కావాలి. ఇవన్నీ జరగాలంటే ఆదాయం కావాలి. ఆ ఆదాయం వారికి advertisements రూపంలో వస్తుంది. అయితే advertisements ద్వారా అధికమైన ఆదాయం రావాలంటే, వాటిని ఎక్కువ మంది చూడాలి. అందుకు ఈ download wesites నిర్వహించేవాళ్ళు రకరకాల పద్ధతుల్ని అనుసరిస్తారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

తెలుగు పాటలు ఉచితంగా download  చేసుకోమనే ఒక website ని ఇప్పుడు  పరిశీలిద్దాం.
ఆ website address type చెయ్యగానే ఈ పేజి వస్తుంది.
ఈ మధ్యనే విడుదలైన ఒక కొత్త సినిమా పాటలు download చెయ్యాలని ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ కింది పేజి వస్తుంది.
ఈ పేజిలోనే advertisements మొదలవడం మీరు చూస్తారు. అయితే ఇక్కడ మిమ్మల్ని ఏ మాత్రం గందరగోళానికి గురిచేయ్యకుండా అన్ని పాటలు download చేసుకోవాలంటే ఎక్కడ క్లిక్ చెయ్యాలో , ఒక్కొక్క పాటని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎక్కడ క్లిక్ చెయ్యాలో చక్కగా రాస్తారు. అన్ని పాటలు download చేసే లింక్ మీద క్లిక్ చేస్తే  ఈ కింది పేజి వస్తుంది.
ఈ పేజి లో రెండు download links ఉన్నాయి. అయితే ఆ రెండూ కూడా వేరే websites లోకి తీసుకేల్తాయి కానీ మనకి కావాల్సిన పాటలని మాత్రం download చేసే లింక్ కావు.

ఈ లింక్ పనిచెయ్యట్లేదు కదా అని వెనక్కు వెళ్లి
ఇంకో లింక్ మీద క్లిక్ చేస్తే ఈ కింది advertisement వస్తుంది.


దీనికీ సినిమా పాటలకీ ఏ సంబంధం లేదు. ఈ advertisement చెప్పేదేంటంటే , అందమైన screensavers ని ఉచితంగా download చేసే toolbar ని download చేసుకోమని. ఇది గనక download చేసుకుంటే, ఈ software తనకితానుగా internet కి connect అయ్యి అనవసరమైన వన్నీ download చేసుకుంటూ మీ internet speed ని తగ్గించేస్తుంది. అంతే కాక ఇలాంటి అందమైన softwares మీ computer లో virus ని inject చేసి మీకు తెలియకుండానే మీ computer లోని ముఖ్యమైన సమాచారాన్ని బయటకు పంపించేస్తుంది. ఈ విషయం మీకు అర్ధమవ్వాలంటే ఈ  కింది వీడియో చూడండి.

 సరే ఈ లింక్ కూడా పనిచేయ్యట్లేదని మళ్ళీ వెనక్కి వెళ్దాం.
 ఈ సారి ఇంకో లింక్ మీద క్లిక్ చేద్దాం. ఈ సారి ఈ కింది పేజి వస్తుంది.
ఈ పేజి లో కూడా రెండు డౌన్లోడ్ లింక్స్ ఉన్నాయి కానీ వాటికీ పాటలకీ ఏ సంబంధం లేదు. కానీ చాలా మంది DOWNLOAD అని రాసి ఉన్నచోట క్లిక్ చేస్తూ ప్రయత్నిస్తూనే ఉంటారు కానీ పాటలు మాత్రం డౌన్లోడ్ అవ్వవు. కానీ మీరు చేసే ప్రతి క్లిక్ వారికి సంపాదన తెచ్చి పెడుతుంది.

ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ఇటువంటి sites పాటలు download చేసే నెపంతో మిమ్మల్ని అనేక అనవసరమైన links మీద క్లిక్ చేపించడం ద్వారా సంపాదన పొందుతాయి. ఇదే సూత్రం సినిమా websites కి , blue ఫిలిం websites కి వర్తిస్తుంది. piracy ద్వారా మనం ఇతరులని మోసం చెయ్యొచ్చు కానీ మనం కూడా మోసపోతున్నామని మర్చిపోవద్దు. కొన్ని sites లో నిజంగా పాటలు డౌన్లోడ్ చేసే లింక్ ఇవ్వవచ్చు కానీ అసలు లింక్ పక్కన పెద్ద పెద్ద size లో ఈ కింద చూపించిన లింక్స్ ఉంటాయి.
ఇందులో ఎర్ర రంగుతో కొట్టేసిన లింక్ మిమ్మల్ని వేరే website కి తీసుకెళ్తుంది. పసుపు రంగుతో ఉన్న లింక్ మీద క్లిక్ చేస్తే పాటలు డౌన్లోడ్ అవుతాయి. కాబట్టి మనం ఉచితంగా పాటల్ని download చేసుకోవచ్చు (piracy ద్వారా) కానీ అనవసరమైన links ద్వారా  తెలియకుండానే వైరస్ లని , అనవసరమైన softwares ని కూడా డౌన్లోడ్ చేసుకుంటాము. తద్వారా ఏదో ఒకరోజు computer నిండా చేరిన వైరస్ మీ జేబులోని కొంత డబ్బుని ఖర్చు పెట్టిస్తుంది.

No comments:

Post a Comment

ఈ బ్లాగ్ లో ఉన్న కంటెంట్ పై ఎవరికైనా ఏమైనా అభ్యంతరం ఉంటే తెలియజేయండి, వాటిని తొలగించబడును.