మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని
సహచరగణంతో 2004లో ప్రారంభమైన ఈ
సామాజిక సంబంధాల వారధి ప్రపంచవ్యాప్తంగా
125కోట్ల పై చిలుకు వినియోగదారులను కలిగి ఉంది. ఫేస్‌బుక్ వినియోగం రోజురోజుకు పెరుగుతున్న నేపధ్యంలో
హ్యాకింగ్ ఘటనలు తరచూ నమోదవుతున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఫేస్‌బుక్
ఖాతాదారులు హ్యాకింగ్ బారిన పడినప్పుడు చేపట్టవల్సిన అత్యవసర చర్యలను
సూచించటం జరుగుతోంది. మొదటి స్టెప్‌లో భాగంగా మీ ఫేస్‌బుక్ అకౌంట్ హోమ్
పేజీ పై కుడి వైపున కనిపించే ‘గేర్ ఐకాన్' పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఓ డ్రాప్-డౌన్ మెనూ
ఓపెన్ అవుతుంది. మెనూలోని సెట్టింగ్స్ ఆప్షన్‌లోకి వెళ్లండి. ADVERTISEMENT సెట్టింగ్స్
పేజీలోకి వెళ్లిన తరువాత ఆ పేజీలో ఎడమవైపు కనిపించే
‘సెక్యూరిటీ' ఆప్షన్ పై క్లిక్
చేయండి. ఆ తరువాత సెక్యూరిటీ సెట్టింగ్స్‌లో కనిపించే *Active Sessions* వద్దకు
వెళ్లండి. ఆ పక్కగా కనిపించే *Edit* పై క్లిక్ చేయండి. ఈ సెక్షన్‌లో మీ ఫేస్‌బుక్ అకౌంట్ లాగిన్‌కు
సంబంధించి రికార్డులు ఉంటాయి. వాటిలో అనుమానస్పద లాగిన్ మీ
కంటపడినట్లయితే సంబంధిత సెషన్ పైన కనిపించే *End
All Activity* పై క్లిక్ చేయండి.
No comments:
Post a Comment
ఈ బ్లాగ్ లో ఉన్న కంటెంట్ పై ఎవరికైనా ఏమైనా అభ్యంతరం ఉంటే తెలియజేయండి, వాటిని తొలగించబడును.