కొన్ని కంపెనీలకు వినియోగాదారుడుకి అతి
ఉత్తమమైన ఉత్పత్తి అందించడమే లక్ష్యం . అయితే చాలా వాటికి
మాత్రం వినియోగాదారుడుకి ఒక్క సారి తమ PRODUCT ని విక్రయించాక తిరిగి ఏదో
విధంగా తమ పైన ఆధారపడేలా చేయడం వారి లక్ష్యం .
కంప్యూటర్ తయారిదారుల్లో ఈ రెండో కోవకి చెందిన వారు ఎక్కువగా ఉంటారు .
ఉదాహరణ :- కొన్ని రకాల విజయవంతమైన MOBILE
PHONE మోడళ్లను COMPANIES ఉన్నట్టుండి తయారు చెయ్యడం ఆపేస్తాయి . దీనికి
కారణం అవి ఎక్కువకాలం మన్నటం వల్ల CUSTOMERS తమ MOBILE ను మార్చుకోవాలనే
ఆలోచనను పక్కన పెడతారు . దాంతో ఆ COMPNIES యొక్క కొత్త MODELS కు అంతగా
విక్రయాలు ఉండవని వారి భయం . అందుకే చాలా COMPANIES మంచి మంచి MOBILE PHONE
MODELS ను తయారు చెయ్యడం ఆపేస్తాయి. అయినా వాటికి DEMAND తగ్గక పోతే వాటి
SUPPORTING SOFTWARES ని ఇవ్వకపోవడం , SPARE PARTS తయారు చెయ్యకపోవడం వంటి
పనుల ద్వారా వాటి వినియోగాన్ని తగ్గిస్తారు .
చాలా మంది కంప్యూటర్ తయారి దారులు ఒక మోడల్ LAPTOP RELEASE చేసిన కొన్ని
రోజులకి వేరొక మోడల్ RELEASE చేస్తారు . నిజంగా అందులో పాత మోడల్ కన్నా
మంచి FEATURES ఉంటె మంచిదే . కానీ వాటిల్లో చాలా వరకూ చిన్న చిన్న
UPGRADATIONS మాత్రమే ఉంటాయి కానీ ఈ కొత్త మోడల్ గనక కొనక పోతే ప్రపంచం
వెనక్కి వెళ్ళిపోతుంది అన్నంతగా ప్రచారం చేస్తారు . దీనికి కారణం
1. మిగతా కంపెనీలతో పోటీలో వెనకబడి పోతామేమో అన్న భయం
2. CUSTOMER వేరే COMPANIES MODEL వైపు మళ్ళిపోతాడేమో అన్న భయం
3. CUSTOMER దగ్గర నుంచి అతి ఎక్కువ డబ్బులు రాబట్టాలనే ఆశ .
ఒక
సారి ఒక LAPTOP కొన్న CUSTOMER కి మళ్ళీ అంత తొందరగా వేరొక మోడల్
కొనాల్సిన అవసరం రాకపోవచ్చు కానీ SPARE PARTS అవసరం అయితే ఖచ్చితంగా
ఉంటుంది . ఈ సూత్రమే COMPANIES FOLLOW అవుతున్నాయి. అవి BIKES అయినా , కార్
అయినా , కంప్యూటర్ అయినా వేరే ఏ ఇతర పరికరం లేదా సేవ అయినా ఇదే సూత్రం.
ఈ పై ఉదాహరణ ఇవ్వడానికి గల కారణం LAPTOP
BATTERY. మీ LAPTOP లో అతి ముఖ్యమైన భాగం BATTERY. ఇక్కడ గమనించాల్సిన
విషయం ఏమిటంటే , LAPTOP WARRANTY వేరు , BATTERY WARRANTY వేరు . అయితే
BATTERY కి WARRANTY ఉండదు లేదా LAPTOP కి ఇచ్చిన WARRANTY కన్నా చాలా
తక్కువ కాలం ఉంటుంది .
ఇక రెండో విషయం . మీ LAPTOP BATTERY లోపల
ఒక charge CYCLE COUNTING CHIP ఉంటుంది . ఇది మీ BATTERY ఎన్ని సార్లు
CHARGE అయ్యిందో , ఎన్ని సార్లు DISCHARGE అయ్యిందో లెక్క వేస్తూ ఉంటుంది .
ప్రతి COMPANY తమ LAPTOP BATTERY ని కొన్ని నిర్దిష్టమైన సార్లు మాత్రమె
ఛార్జ్ మరియు DISCHARGE చేసేలా ఒక prograame ని రూపొందించ ఈ చిప్ లో
భద్రపరుస్తాయి . అన్ని సార్లకి మించి మీరు CHARGE చెయ్యలేరు ఎందుకంటే ఆ
చిప్ CHARGING ని అడ్డుకుంటుంది . దాంతో మీరు BATTERY ని మార్చక తప్పని
పరిస్తితి ఏర్పడుతుంది .
అసలు ఈ CHARGE CYCLES అంటే ఏంటో చూద్దాం
ఒక CHARGE మరియు ఒక DISCHARGE కలిపి ఒక
CYCLE . అంటే మీరు మీ LAPTOP ని ఒక సారి CHARGING పెట్టి ఆ తర్వాత
వాడితే (AC ADAPTER లేకుండా ) అది ఒక CYCLE . దీని మీద
భిన్నాభిప్రాయాలున్నాయి . ఎందుకంటే ఒక్కో COMPANY ఒక్కోలా CYCLES ని
లేక్కేస్తుంది .
APPLE COMPANY ప్రకారం
BATTERY ని ఒక సారి పూర్తిగా (100%) ఛార్జ్ చేసి
పూర్తిగా DISCHARGE (100%) చేస్తే ఒక CYCLE అని చెప్తుంది.
ఉదాహరణ :- . మీ BATTERY ని 100%ఛార్జ్
చేసి , కొంత సేపు వాడారు అనుకుందాం . అప్పుడు అది 25% discharge అయ్యింది.
మళ్ళీ రెండవ రోజు ఇంకో 50% వాడారు . అంటే ఇప్పటికి 75% పూర్తయ్యింది .
తర్వాత రోజు మిగతా 25% వాడారు . అంటే పూర్తిగా DISCHARGE చేసారు కాబట్టి ఒక
CYCLE పూర్తయ్యింది.
ఇంకో లెక్క ప్రకారం
ఒక సారి 50% కంటే ఎక్కువ ఛార్జ్ చేసిన
తర్వాత, BATTERY తో LAPTOP వాడుతున్నప్పుడు 50% కంటే తక్కువకి CHARGING
రాగానే ఒక CYCLE పూర్తవుతుంది.
కానీ ఏది పూర్తిగా నిజమో కాదో ఎవ్వరికీ
తెలియదు . ఎందుకంటే ఎన్ని సార్లు ఛార్జ్ చేసాం , ఎన్ని సార్లు DISCHARGE
చేసాం అన్నది లెక్కపెట్టడం మన వల్ల అయ్యే పని కాదు దాంతో ఈ CYCLE
లేక్కలనేవి ఒక రహస్యంగానే ఉండిపోయాయి.
మొత్తం మీద మనం అర్ధం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే BATTERY లోని చిప్ ప్రతి CHARGE ని DISCHARGE ని లేక్కేస్తుంది . ఇక్కడ నవ్వుతో కూడిన ఏడుపు తెప్పించే విషయం ఏమిటంటే , మీ LAPTOP BATTERY CONDITION ఎలా ఉన్నా (ఒక వేళ చక్కగానే ఉన్నా ) CHIP లో ఇన్ని CYCLESకు మించి BATTERY ని వాడకూడదు అని PROGRAMME ఉంది కాబట్టి మన BATTERY పాడై పోయినట్లే లెక్క. అంతకు మించి ఉపయోగిద్దామని మీరు ప్రయత్నం చేసినా మీ BATTERY ఛార్జ్ అవ్వదు . అంటే మీ BATTERY భవిష్యత్తుని నిర్ణయించేది దాని పనితనం కాదు . చిప్!.
COMPANIES చెప్పేదేంటంటే అన్ని CYCLES
మించిన తర్వాత ఆ BATTERY జీవిత కాలం తగ్గిపోయినట్లే అని . ఒక వేళ అది నిజమే
అయితే , CHIP అవసరం దేనికి ? BATTERY తనంతట తానుగానే CHARGING తీసుకోదు
కదా! ఒక CHIP ని ఉపయోగించి CHARGING ని BLOCK చెయ్యడం ఎందుకు? కాబట్టి
ఇందులో ఖచ్చితంగా ఏదో దురుద్దేశం దాగి ఉందని COMPUTER నిపుణుల అభిప్రాయం .
అదే నా అభిప్రాయం కూడా .
కాబట్టి మీ BATTERY జీవిత కాలం పెరగటానికి ఉత్తమమైన మార్గం ఏమిటంటే
1.మీరు SWITCH BOARD కి దగ్గరగా
ఉన్నట్లయితే LAPTOP ని AC ADAPTER తోనే వాడండి . దీని వల్ల మీ BATTERY OVER
CHARGE అవ్వదు ఎందుకంటే అది 100% FULL అవ్వగానే దానికి POWER CUT -OFF
అయ్యి CHARGING ఆగిపోతుంది మరియు AC ADAPTER మీదనే LAPTOP పని చేస్తుంది .
కానీ వారానికి ఒక్క సారైనా BATTERY ని పూర్తిగా వాడేయండి . (100%
DISCHARGE ).
2. ఒక వేళ మీకు BACK -UP POWER SOURCE
అంటే UPS లేదా INVERTER వంటివి ఉన్నట్లయితే , BATTERY ని LAPTOP లో నించి
తొలగించి AC ADAPTER తో మాత్రమె వాడండి . కానీ వారానికి ఒక్కసారి BATTERY
ని పూర్తిగా discharge చెయ్యడం మర్చిపోకండి .
BATTERY ని అప్పుడప్పుడైనా పూర్తిగా
DISCHARGE చెయ్యకుండా, AC ADAPTER మీదే వాడితే battery జీవిత కాలం దెబ్బ
తింటుంది . అందుకే అప్పుడప్పుడు దాన్ని పూర్తిగా discharge చేస్తూ ఉండాలి .
No comments:
Post a Comment
ఈ బ్లాగ్ లో ఉన్న కంటెంట్ పై ఎవరికైనా ఏమైనా అభ్యంతరం ఉంటే తెలియజేయండి, వాటిని తొలగించబడును.