దొంగను పట్టిచ్చే యాప్ లు వచ్చేశాయి. లుక్
అవుట్ అనే యాప్ సెల్ ఫోన్ దొంగతనం చేసే వాళ్ల ఫోటోలను, దొంగతనం చేసిన
ప్రదేశాన్ని ఫోటో తీసి, యజమానికి ఈ మెయిల్ చేసేస్తుంది. గంటల్లో దొంగను
పట్టేయచ్చు.
ఈ లుక్ అవుట్ అనే యాప్ తాజాగా అమెరికాలోని
ఫ్లోరిడా లో ఒక మహిళా దొంగను పట్టేసింది. దొంగ ఓ కారు నుంచి సెల్ ఫోన్ ను
తీసుకుంది. కారు యజమాని విండో మూయడం మరిచిపోవడంతో దొంగ పని సులువయింది.
అయితే దొంగ ఫోన్ ను అన్ లాక్ చేయడానికి ప్రయత్నించగానే ఆ యాప్ అలర్ట్
అయిపోయింది. ఆమె ఫోటో తీసేసింది. ఆ తరువాత దొంగతనం చేసిన ప్రదేశం తాలూకు
ఫోటోలు తీసింది. ఆ ఏరియా మ్యాప్ ను డౌన్ లోడ్ చేసేసింది. ఇవన్నీ యజమానికి ఈ
మెయిల్ రూపంలో వచ్చేశాయి.
ఆ యజమాని సోషల్ మీడియాలో దొంగ ఫోటో,
దొంగిలించిన ప్రదేశం తాలూకు ఫోటోలను అప్ లోడ్ చేసింది. గంటల్లో ఆ వివరాలు
వేలాది మంది షేర్ చేశారు. దాంతో దొంగను గుర్తించి పట్టేసుకున్నారు.
ఫోన్ మరిచిపోయే వాళ్లకు ఈ యాప్ ఎంతో ఉపయోగం. కానీ సెల్ దొంగలకు ఈ యాప్ అంటే బాప్ రే బాప్!!
No comments:
Post a Comment
ఈ బ్లాగ్ లో ఉన్న కంటెంట్ పై ఎవరికైనా ఏమైనా అభ్యంతరం ఉంటే తెలియజేయండి, వాటిని తొలగించబడును.